Allu Arjun: ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌లో అల్లు అర్జున్‌.. డైరెక్టర్ గా ఎవరంటే.?

Allu Arjun And Murugudoss Combination: వరుస హిట్లతో స్టైలిష్ స్టార్‌ టూ.. ఐకానిక్ స్టార్‌ గా మారిన అల్లు అర్జున్‌...

  • Ravi Kiran
  • Publish Date - 7:31 pm, Tue, 4 May 21
Allu Arjun: ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌లో అల్లు అర్జున్‌.. డైరెక్టర్ గా ఎవరంటే.?
Allu Arjun

Allu Arjun And Murugudoss Combination: వరుస హిట్లతో స్టైలిష్ స్టార్‌ టూ.. ఐకానిక్ స్టార్‌ గా మారిన అల్లు అర్జున్‌.. ఇప్పుడో సూపర్ హిట్‌ సీక్వెల్లో నటిస్తున్నారు. అవును 2005లో రిలీజై అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ రికార్డులు బద్దలు కొట్టిన ఆ సినిమా రిమేక్‌లో నటించేందుకు రెడీ అయిపోతున్నారట. ఇంతకీ ఆ సినిమా ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా..? అదే ‘గజిని’ సినిమా.

మురుగదాస్‌ డైరెక్షన్ లో సూర్య హీరోగా తెరకెక్కిన ‘గజిని’ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. ఇక ఈ సీక్వెల్‌ను పాన్‌ ఇండియా లెవల్లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తో తెరకెక్కించాలని మురుగదాస్‌ ట్రై చేస్తున్నాడట. దీనికి అల్లు అరవింద్ కూడా ఓకే చెప్పినట్లు వినికిడి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తారని సమాచారం. ఇప్పుడిదే విషయం ఇటు కోలీవుడ్లోనూ… అటు టాలీవుడ్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. త్వరలోనే ఈ క్రేజీ డైరెక్టర్ ‘గజిని -2’ స్క్రిప్ట్‌ పనులు మొదలుపెట్టనున్నారట. చూడాలి మరి.. ముందు ముందు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ వస్తాయో..

Also Read:

Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..

మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?

Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!