AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Bans: మా ఇంటికి రావద్దు.. మీ ఇంటికి పిలవద్దు.. భారతీయులకు మరో దేశం షాక్.. ప్రయాణ రాకపోకలపై శ్రీలంక నిషేధం

భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులు తమ దేశంలో దిగేందుకు అనుమతి ఇవ్వమని శ్రీలంక సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ తెలిపింది. ఇండియా నుంచి శ్రీలంకకు జరిగే ప్రయాణాలపై పూర్తిగా నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది.

Sri Lanka Bans: మా ఇంటికి రావద్దు.. మీ ఇంటికి పిలవద్దు.. భారతీయులకు మరో దేశం షాక్.. ప్రయాణ రాకపోకలపై శ్రీలంక నిషేధం
Sri Lanka Bans Travellers From Indian Passengers
Balaraju Goud
|

Updated on: May 06, 2021 | 5:11 PM

Share

Sri Lanka Bans Indian Travellers: దేశంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో భారత్‌పై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే బ్రిటన్‌, కెనడా, యూఏఈ, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాలు భారతీయుల రాకపై నిషేధం విధించగా.. తాజాగా పొరుగున ఉన్న శ్రీలంక సైతం అదే బాట పట్టింది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులు తమ దేశంలో దిగేందుకు అనుమతి ఇవ్వమని శ్రీలంక సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ తెలిపింది. ఇండియా నుంచి శ్రీలంకకు జరిగే ప్రయాణాలపై పూర్తిగా నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. భారత్‌లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింద

భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను శ్రీలంకలోకి అనుమతించేది లేదని తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. భారత్‌లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఆదేశాలను శ్రీలంక ఎయిర్‌లైన్స్ సీఈఓకు డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఓ లేఖ ద్వారా పంపించారు. శ్రీలంక ఆరోగ్య శాఖాధికారుల సూచనల మేరకు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు.

దీనిపై శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి ప్రసన్న రణతుంగ స్పందించారు. భారత పర్యాటకులు శ్రీలంకను ట్రావెల్‌ బబుల్‌లో సందర్శిస్తారని చెప్పారు. కరోనా సంక్షోభం వల్ల శ్రీలంకను సందర్శించే భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గిందని తెలిపారు. ఆరోగ్య అధికారులు అభ్యర్థన చేస్తే తప్ప విమానాశ్రయాలను మూసివేయడం, శ్రీలంకకు వచ్చే వారి సంఖ్యను తగ్గించడంపై నిర్ణయం తీసుకోలేమన్నారు. విమానాశ్రయాన్ని వెంటనే మూసివేయడం సాధ్యం కాదని, అలా చేస్తే స్వదేశానికి తిరిగి వచ్చే లంక ప్రజలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.

ఇదిలావుంటే, మన దేశంలో రోజువారీ కొత్త కోవిడ్ 19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, గడచిన 24 గంటల్లో కొత్తగా 4,12,262 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా 3,980 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,10,77,410కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 2,30,168కి చేరింది.

Read Also..  థర్డ్ కోవిడ్ వేవ్ కి రెడీగా ఉండండి, కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక, వ్యాక్సినేషన్ సన్నాహాలు చేపట్టాలని సూచన