AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థర్డ్ కోవిడ్ వేవ్ కి రెడీగా ఉండండి, కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక, వ్యాక్సినేషన్ సన్నాహాలు చేపట్టాలని సూచన

థర్డ్ కోవిడ్ వేవ్ కి సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది. ఇది తప్పదని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారని, సాధ్యమైనంత త్వరగా యువతకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని న్యాయమూర్తులు జస్టిస్ వై.వీ.చంద్రచూడ్

థర్డ్ కోవిడ్ వేవ్ కి రెడీగా ఉండండి, కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక, వ్యాక్సినేషన్ సన్నాహాలు చేపట్టాలని సూచన
Supreme Court
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 06, 2021 | 4:52 PM

Share

థర్డ్ కోవిడ్ వేవ్ కి సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది. ఇది తప్పదని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారని, సాధ్యమైనంత త్వరగా యువతకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని న్యాయమూర్తులు జస్టిస్ వై.వీ.చంద్రచూడ్, జస్టిస్ షాలతో కూడిన బెంచ్ సూచించింది. ఈ థర్డ్ వేవ్ కారణంగా దీని ప్రభావం పిల్లలపై కూడా పడవచ్చునని, వారు ఆసుపత్రి పాలైనప్పుడు వారి తలిదండ్రులు కూడా వారివెంట ఉండాల్సిందేనని పేర్కొంది. ఈ కారణంగా ఈ గ్రూపు వారికి వ్యాక్సినేషన్ ఎంతయినా అవసరమని బెంచ్ తెలిపింది. ఈ దిశగా ఓ సమగ్ర ప్లాన్ ని రూపొందించి ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలని బెంచ్ హితవు చెప్పింది. ఇప్పటినుంచే ప్రిపేర్ చేస్తే ఆ తరువాత పరిస్థితిని హ్యాండిల్ చేయవచ్చునని న్యాయమూర్తులు అన్నారు. ప్రస్తుత, భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కొనేందుకు హెల్త్ కేర్ సిబ్బంది సంఖ్యను పెంచాలని, కొత్త మార్గాలను పరిశీలించాలని వారు సూచించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ కోర్సుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న డాక్టర్ల సేవలను వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని కూడా కోర్టు కోరింది. 1.5 లక్షల మంది డాక్టర్లు మెడికల్ కోర్సు పూర్తి చేసి ‘నీట్’ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారని, వారి సర్వీసులను ఎలా వినియోగించుకుంటారని బెంచ్ ప్రశ్నించింది.

వీరితో బాటు 2.5 లక్షల మంది నర్సులు కూడా ఇళ్లలోనే ఉన్నారు.. థర్డ్ వేవ్ కోవిడ్ నేపథ్యంలో వీరి సేవలను కూడా వినియోగించుకునే అవకాశాలను కేంద్రం పరిశీలించాలి అని కోర్టు అభిప్రాయపడింది. వీరి సర్వీసులు ఎంతయినా దోహదపడతాయని పేర్కొంది. ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఢిల్లీహైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన అప్పీలును అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఢిల్లీకి వెంటనే 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ని సప్లయ్ చేయాలని ఢిల్లీహైకోర్టు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. కేంద్రానికి కోర్టు షో కాజ్ నోటీసులను కూడా జారీ చేసింది.తమ ఉత్తర్వులను పాటించకపోతే మీపై కోర్టు ధిక్కార చర్యలకు పూనుకొంటామని కూడా హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Chhattisgarh dies: ఛత్తీస్‌గఢ్‌లో కొంపముంచిన నాటు వైద్యం.. మందు వికటించి 8 మంది మృతి, ఐదుగురికి సీరియస్

Jasprit Bumrah Wishes: ‘ప్రియమైన శ్రీమతి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. బుమ్రా లవ్లీ పోస్ట్‌ వైరల్‌.!