Chhattisgarh dies: ఛత్తీస్‌గఢ్‌లో కొంపముంచిన నాటు వైద్యం.. మందు వికటించి 8 మంది మృతి, ఐదుగురికి సీరియస్
ఛత్తీస్‌గఢ్‌లో విషాదంలో చోటుచేసుకుంది. బిలాస్‌పూర్ జిల్లాలో వైద్యం వికటించిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ఐదుగురికి సీరియస్.
Family dies in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో విషాదంలో చోటుచేసుకుంది. బిలాస్‌పూర్ జిల్లాలో వైద్యం వికటించిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వారిని ఆస్పత్రిలో చేర్చించారు. హోమియోపతి ఔషధాలే ఈ మరణాలకు కారణమని బిలాస్‌పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఈ ఔషధాల్లో ఆల్కహాల్ ఉండటమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, వీరందరికి చికిత్స చేసిన వైద్యుడు పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిరిగిట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్మి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. మంగళవారం రాత్రి నలుగురు బాధితులు చనిపోగా.. మిగతా నలుగురు బుధవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు బిలాస్‌పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. బాధితులు కమలేశ్ ధూరి (32) అక్షయ ధూరి (21), రాజేశ్ ధూరి (21), సామ్రూ ధూరి (25)లు ద్రోసరే 30 ఔషధం తీసుకున్నట్టు తెలిపారు. ఇదే ఔషధం తీసుకున్న ఖేమ్‌చంద్ ధూరి (40), కైలాశ్ ధూరి (50), దీపక్ ధూరి (30)లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
కోర్మి గ్రామానికి చెందిన కమలేశ్ ధూరి కుటుంబం కరోనా లక్షణాలు కనిపించడంతో స్థానిక వైద్యుడిని ఆశ్రయించారు. దీంతో వారికి ద్రొసరే 30 అనే ఔషధాన్ని ఇచ్చాడు. ఇది సేవించిన కుటుంబం మొత్తం అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. అయితే, ద్రొసరే 30 అనే ఈ ఔషధం తయారీలో ఆల్క్‌హాల్‌కు బదులు నాటుసారాను వినియోగించారని తెలిపారు. హోమియోపతి చికిత్సలో ఈ ఔషధాన్ని గొంతునొప్పి, జలుబు వంటి ఇబ్బందులతో బాధపడుతున్నవారికి వినియోగిస్తారు. కోవిడ్ సమయంలో జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉండటంతో చత్తీస్‌గఢ్ వైద్యుడు దీనిని ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేలా విచారం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆయన ఆదేశించారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Chhattisgarh | 8 members of a family dead, 5 hospitalized after consuming a homeopathic medicine in Bilaspur, says CMO
“They consumed homeopathic medicine Drosera 30, which contains 91% alcohol mixed with country-made liquor. The doctor is absconding,” he adds pic.twitter.com/HuIhnDQqU0
— ANI (@ANI) May 6, 2021
అయితే, మంగళవారం మృతిచెందినవారికి కోవిడ్ ఉందనే అనుమానంతో అధికారులకు తెలియకుండా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం అక్కడకు చేరుకున్న పోలీసులు.. అస్వస్థత గురైన మరో ఐదుగుర్ని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగుర్ని చత్తీస్‌గఢ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు, ఇంకొకర్ని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.