AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Elephant Attack: ఏపీలో గజరాజుల విధ్వంసం.. పాత కలికోట ఏనుగుల దాడిలో మహిళా రైతు మృతి

అడవుల్లో ఠీవిగా తిరగాల్సిన గజరాజులు.. సమీప గ్రామాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. అన్నదాతల ఉసురు తీస్తున్నాయి. గుంపుల నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగులు విధ్వంసాలకు పాల్పడుతున్నాయి.

AP Elephant Attack: ఏపీలో గజరాజుల విధ్వంసం.. పాత కలికోట ఏనుగుల దాడిలో మహిళా రైతు మృతి
Woman Farmer Dies In Elephant Attacked
Balaraju Goud
|

Updated on: May 06, 2021 | 7:20 PM

Share

Destruction of Elephants in AP: అడవుల్లో ఠీవిగా తిరగాల్సిన గజరాజులు.. సమీప గ్రామాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. అన్నదాతల ఉసురు తీస్తున్నాయి. గుంపుల నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగులు విధ్వంసాలకు పాల్పడుతున్నాయి. దాడుల్లో పాడి పశువులూ అసువులు బాస్తున్నాయి.. పంటలూ దెబ్బతింటున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాల్లో ఏనుగులు బీభత్సం చేస్తున్నాయి. విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఏనుగులుబీభత్సంతో ప్రజలు వణికిపోతున్నారు. ఒంటరిగా ఊరు దాటాలంటే భయపడిపోతున్నారు. ఓవైపు పంట నాశనమవుతుంటే… మరోవైపు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అటవీ అధికారుల చర్యలు ఎలాంటి ఫలితాన్నివ్వడం లేదు.

ఏపీలో ఓవైపు మాయదారి కరోనా భయపెడుతుంటే… మరోవైపు గజరాజులు టెన్షన్‌ పెడుతున్నాయి. కరోనా వల్ల చాలా మందికి ఒంటరిగానే పొలాలకు వెళ్తున్నారు. అలా వెళ్లిన వారిపై ఏనుగు దాడి చేస్తున్నాయి. విజయనగరం జిల్లా కొమరాడ మండలం పాత కళ్లికోట గ్రామానికి చెందిన అల్లాడ అప్పమ్మ(50) ఒంటరిగా పొలానికి వెళ్లింది. కూరగాయాలు ఏరుతున్న ఆమెపై ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది.

ఇప్పటి వరకు ఏనుగు దాడిలో కురుపాం నియోజకవర్గంలో ఆరుగురు మృతి చెందారు. అటవీశాఖ అధికారులు రాత్రి పగలు కష్టపడటమే తప్ప పూర్తిగా ఎనుగులను తరలించలేని పరిస్థితి. గజరాజుల వల్ల పండిన పంట తెచ్చుకోలేకపోతున్నామంటున్నారు ప్రజలు. 20 రోజులుగా ఇదే భయంతో ఉన్నారు. ఇంత జరిగినా అధికారులు ఏనుగుల తరలించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. తమ ప్రాణాలకు భరోసా ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మూడున్నరేళ్లుగా ఇదే రిపీట్ అవుతుందని అటవీశాఖ అధికారులు ఏనుగుల వెనకాల తిరగడం తప్ప పరిష్కారం చూపలేదంటున్నారు. చనిపోయినవారికి, పంట నష్ట పోయిన వారికి పరిహారం ఇస్తున్నారే కానీ పరిష్కారం చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో పంట పొలాలకు వెళ్లలేమంటున్నారు ప్రజలు. తామే తిరుగుబాటు చేసే పరిస్థితి కొనితెచ్చుకోవద్దని జనం హెచ్చరిస్తున్నారు.

అటు, చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో కూడా ఇలాంటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అడవీలో ఉండాల్సిన గజరాజులు తరచూ జనసంచారంలోకి వస్తున్నాయి. ఇది అక్కడి జనానికి సమస్యగా మారింది. పొలాలకు వెళ్లాలన్నా… ఊరుదాటి వెళ్లాలన్నా… కంగారుపడుతున్నారు. అటవీ ప్రాంతంలోకి తరిమికొట్టేందుకు ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిచడం లేదు. అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదిలావుంటే, ఏపీ​లోని విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజను నాగావళి తీరప్రాంతంలోని గరుగుబిల్లి, కొమరాడ, జియ్యమ్మవలస, పార్వతీపురం మండలాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. 2017 ఆగస్టులో ఒడిశా నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ మూడున్నరేళ్లలో ఏనుగుల దాడిలో ఐదుగురు చనిపోయారు. మూడు ఏనుగులు మృత్యువాత పడ్డాయి.

కొమరాడ మండలం నాయుడువలసకు చెందిన నిమ్మక పకీరు 2019 జనవరి 12న, జియ్యమ్మవలస మండలం పెదకుదమకు చెందిన కె.కాశెన్నదొర 2019 మే 21న, బాసంగికి చెందిన గంట చిన్నమ్మి 2019 డిసెంబరు 6న, గుమడకు చెందిన ఎర్ర నారాయణరావు 2020 అక్టోబరు 29న, పరశురాంపురంలో రఘుమండల లక్ష్మంనాయుడు 2020 నవంబరు 13న మృతి చెందారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో సుమారు 57 ఏనుగులు సంచరిస్తున్నాయి. వీటిని పట్టుకోవడానికి అటవీశాఖ నుంచి అనుమతులు రావాలని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తాం. గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగులతో ఎక్కువ ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు. ఎటు వెళ్లాలో తెలియక హింసకు పాల్పడతాయని అన్నారు. వీటి మరింత అప్రమత్తంగా ఉండి సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Read Aslo… పెళ్ళి చేసుకున్న పాపులర్ కమెడియన్స్.. 9 రోజుల తర్వాత షాకిచ్చిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..