Corona Danger-bells: దేశంలో కరోనా డేంజర్ బెల్స్… తగ్గినట్టే తగ్గి మళ్ళీ 4 లక్షలు దాటేసిన కేసులు.. పీఎం ఏం చేశారంటే?
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు, మరణాలు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు.
Corona Danger-bells in India: ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు (CORONA CASES) తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు, మరణాలు మహారాష్ట్ర (MAHARASHTRA)లో నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ (LOCK-DOWN) విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ (NIGHT CURFEW) విధిస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడు (TAMILNADU), పంజాబ్ (PUNJAB), మధ్యప్రదేశ్ (MADHYA PRADESH), కేరళ (KERALA) తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు (CORONA CASES) తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా 4వేలమంది దగ్గరగా మరణించారు. ఇప్పటి వరకే భారత్ 2 కోట్ల 10 లక్షల 77 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఒక్క రోజే మే 6న 3 లక్షల 29 వేల 113 మంది కోలుకోగా, ఇప్పటి వరకు రికవరీ కేసులు కోటి 72 లక్షల 80 వేల 884 ఉన్నాయి. యాక్టివ్ కేసులు 35 లక్షల 66 వేల 398 ఉన్నాయి. దేశంలో చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం తగ్గకుండా రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ (PRIME MINISTER NARENDRA MODI) అన్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర మంత్రులు (UNION MINISTERS), ఉన్నతాధికారులతో ఆయన మే6న సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు, జిల్లాల వారీగా నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య, మౌలిక సదుపాయాలు పెంచడానికి రాష్ట్రాలకు సహాకారం, ఔషధాల లభ్యతలపై ప్రధానంగా చర్చించారు. దేశంలో వ్యాక్సినేషన్ (VACCINATION) జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటివరకు రాష్ట్రాలకు 17.7 కోట్ల టీకాలు సరఫరా చేసినట్లు అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. 45 ఏళ్లు పైబడిన అర్హత కలిగిన జనాభాలో 31శాతం మందికి తొలి మోతాదు టీకా ఇచ్చారని అధికారులు ప్రధానికి తెలిపారు. ఈ సందర్భంగా టీకా వృథాపై రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితిని మోదీ (MODI) ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉన్నప్పటికీ పౌరులు టీకా పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీకా ప్రక్రియలో పాల్గొనే ఆరోగ్య కార్యకర్తలను ఇతర విధుల కోసం మళ్లించకూడదని సూచించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్ (RAJNATH SINGH), అమిత్ షా (AMIT SHAH), నిర్మలా సీతారామన్ (NIRMALA SITARAMAN), హర్ష్ వర్ధన్ (HARSHA VARDHAN), పీయూష్ గోయల్ (PIYUSH GOEL) తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కరోనా సెకండ్‌వేవ్ (CORONA SECOND WAVE) దేశాన్ని పట్టి కుదిపేస్తోంది. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశ రాజధాని దిల్లీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 335మంది కరోనాతో చికిత్స పొందుతూ మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 78 వేల 780 కరోనా టెస్టులు చేయగా, 19 వేల 133 మంది కరోనా బారిన పడ్డారు. పాజిటివిటీ రేటు 24.29శాతంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీకి 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసినందుకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రోజూ ఢిల్లీకి సరిపడే ఆక్సిజన్ సరఫరా అందించేలా చూడాలని ప్రధానికి విజ్ఞపి చేశారు.
ఢిల్లీలో కరోనా విజృంభణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలో కరోనా కల్లోలిత ప్రాంతాల్లో ఢిల్లీ ముందు వరుసలో ఉంటుంది. అయితే, కరోనా రోగుల్లో ఆక్సిజన్ వాడకం పెరిగిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆక్సిజన్ అవసరమైతే, ఇంటి వద్దకే అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తే ఇంటి వద్దకే ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తారు. ఈ వెసులుబాటు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తుందని కేజ్రీవాల్ సర్కారు వెల్లడించింది. గోవాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా వైరస్ సోకివుంది. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 51 శాతానికి పెరిగింది. దేశంలో కరోనా వైరస్ అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో గోవా ఒకటి. ఈ రాష్ట్రంలో వైరస్ విజృంభణ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఇక్కడ పరీక్షలు నిర్వహించిన ప్రతి ఇద్దరిలో ఒకరు పాజిటివ్‌గా తేలడం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో గోవా ప్రభుత్వం నాలుగు రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. నేటి నుంచి సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. అత్యవసర సేవలు, పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చినట్టు చెప్పారు. అయితే ప్రజారవాణాకు అనుమతి లేదని స్పష్టంచేశారు.
కోవిడ్ కేసులకు అడ్డుకట్ట వేసేందుకు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ చైన్‌ను తెగ్గొట్టేందుకు పది రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. మే 6వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను పూర్తిగా మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. దీంతో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక లాక్ డౌన్‌ను ప్రకటిస్తే మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధించాయి. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ కరోనా సెకండ్ వేవ్ కేసుల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. కేరళ రాష్ట్రవ్యాప్తంగా మే 8 ఉదయం 6 గంటల నుంచి మే 16 వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. కేరళలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు సీఎం పినరయి విజయన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కరోనా కట్టడి చేసేందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా వార్డు స్థాయి కమిటీలను బలోపేతం చేసే దిశగా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. కరోనా భూతం విపరీతమైన వేగంతో వ్యాపిస్తోందని, రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, కఠిన చర్యలు తప్పవన్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు ఏమాత్రం తగ్గడంలేదని వెల్లడించారు.
కేరళలో నిన్న ఒక్కరోజే 42వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 57 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3 లక్షల 56 వేల 872 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 5 వేల మంది కరోనా బారిన పడి మరణించారు. కొత్త కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడం ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల జాబితాలో 10 జిల్లాలతో కేరళ తొలిస్థానంలో ఉంది. దేశంలో అత్యధిక కేసులు పెరుగుతున్న 24 రాష్ట్రాల్లో మొదటి నాలుగు స్థానాల్లో కేరళ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో కొత్తగా 6,026 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒక్కరోజులో కరోనాతో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4లక్షల75వేల 748కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3లక్షల96వేలకు పైగా కోలుకున్నారు. అయితే పలు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 11వందలకు పైగా కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 418, రంగారెడ్డి జిల్లాలో 403 కేసులు, నల్గొండ జిల్లాలో 368, సంగారెడ్డి జిల్లాలో 235 రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
హైదరాబాద్ పరిధి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లన్నీ దాదాపు నిండిపోయాయి. పరిస్థితి విషమించి ఎవరినైనా చేర్చాల్సి వస్తే బెడ్ దొరకడం కష్టతరంగా మారింది. పరిస్థితులు అదుపుతప్పినట్లు అర్థమవుతుంది. హైదరాబాద్‌లోని గాంధీతోపాటు టిమ్స్, కింగ్‌కోఠి, చెస్ట్ హాస్పిటల్, ఈఎస్ఐ, నిమ్స్, రైల్వే ఆసుపత్రి… ఇలా అన్నింటిలోనూ బెడ్స్ పూర్తిగా నిండిపోయాయి. ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకలను కూడా వెంటిలేటర్ బెడ్లుగా మార్చడంతో… కొన్ని ఖాళీలు ఉన్నట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత వరుసగా నాలుగో రోజు 20వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1లక్షా10వేలకు పైగా పరీక్షలు నిర్వహించగా.. 21వేల954 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 72 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌తో విశాఖలో అత్యధికంగా 11మంది చనిపోగా, తూర్పుగోదావరి 9, విజయనగరం 9, అనంతపురం 8, ప్రకాశం 6, చిత్తూరు 5, గుంటూరు 5, కృష్ణా 4, కర్నూలు 4, శ్రీకాకుళం, 4, నెల్లూరు 2 మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 8వేల446కి చేరింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 3వేల531 కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో అత్యల్పంగా 548మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో వెయ్యికిపైగా బాధితులు వైరస్ బారినపడ్డారు.
కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని సూచించారు. ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలన్నారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా, తప్పనిసరిగా చేర్చుకోవాలని అధికారులకు జగన్ స్పష్టం చేశారు. కోవిడ్ ఆస్పత్రుల వద్దే కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, తాత్కాలికంగా హ్యాంగర్లలో అన్ని వసతులతో ఉన్న సీసీసీలను ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. అవసరమైతే ఆస్పత్రుల వైద్యులు ఆ సీసీసీలో కూడా సేవలందించాలని తెలిపారు. కోవిడ్ ఆస్పత్రుల్లో నాణ్యమైన ఆహారం, శానిటేషన్, ఆక్సీజన్, మెడికల్‌కేర్‌తో పాటు వైద్యులు కూడా అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు. తగినంత ఆక్సీజన్ సరఫరా, నిల్వల కోసం వెంటనే చర్యలు చేపట్టాలని, కేంద్రం కేటాయింపుతో పాటు ప్రత్యామ్నాయంపై కూడా దృష్టి నిలపాలన్నారు.
Read more: రైతులకు శుభవార్త… మీ అకౌంట్లోకి రూ.2000 వచ్చేది ఆరోజునే.. మరీ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకున్నారా ?
కోవిడ్ పేషెంట్లకు పూర్తి ఉచిత వైద్య సేవలు.. అసవరమైన బెడ్లను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం
కరోనా భయం.. విటమిన్ ట్యాబ్లెట్లకు పెరిగిన డిమాండ్.. పండ్లు, కూరగాయలే బెస్ట్..