700 టన్నుల ఆక్సిజన్ ఇస్తారా? కోవిడ్ మరణాలు సంభవించకుండా చూస్తాం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ప్రతి రోజూ 700 టన్నుల ఆక్సిజన్ ఇస్తే నగరంలో కోవిడ్ మరణాలు సంభవించకుండా చూస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

700 టన్నుల ఆక్సిజన్ ఇస్తారా? కోవిడ్ మరణాలు సంభవించకుండా చూస్తాం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Cm Arvind Kejriwal
Follow us

| Edited By: Phani CH

Updated on: May 06, 2021 | 7:40 PM

ప్రతి రోజూ 700 టన్నుల ఆక్సిజన్ ఇస్తే నగరంలో కోవిడ్ మరణాలు సంభవించకుండా చూస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇన్ని టన్నుల్లో సగం మాత్రమే తమ నగరానికి అందుతోందన్నారు. పొరుగునున్న బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, హర్యానాలకు ఆక్సిజన్ కేటాయింపులో కేంద్రం ప్రాధాన్యతనిస్తోందని ఆయన విమర్శించారు. మాకు 700 టన్నుల ఆక్సిజన్ ఇవ్వండి.. ఈ నగరంలోని హాస్పిటల్స్ లో తొమ్మిది వేల నుంచి తొమ్మిదిన్నరవేల బెడ్స్ ఏర్పాటు చేయగలుగుతాము..అలాగే ఆక్సిజన్ బెడ్స్ ను కూడా ఏర్పాటు చేస్తాం అని ఆయన చెప్పారు.ఆక్సిజన్ కొరత కారణంగా ఏ రోగి కూడా మరణించకుండా చూస్తామన్నారు. అంటే కొరత అంటూ లేకుంటే,అది రెగ్యులర్ గా సప్లయ్ అయితే ఏ రోగి కూడా మరణించడని ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. ప్రాణవాయువు సంక్షోభం కారణంగా హాస్పిటల్స్ తమ బెడ్స్ సంఖ్యను తగ్గించుకుంటున్నాయని, కానీ అలా చేయవద్దని ఆయన కోరారు. ఢిల్లీకి 700 టన్నుల ఆక్సిజన్ ని కేటాయించాలని సుప్రీంకోర్టు కూడా కేంద్రానికి సూచించింది. మొదట ఢిల్లీ హైకోర్టు దీనిపై కేంద్రానికి తీవ్ర స్థాయిలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోగా ఈ నగరానికి 700 టన్నుల ప్రాణవాయువు ఇవ్వాలని లేని పక్షంలో మీపై కోర్టు ధిక్కార చర్యలకు దిగుతామని హెచ్చరించింది. అయితే దీనిపై కేంద్రం సుప్రీంకోర్టుకెక్కగా ..హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. కానీ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రం ఇవ్వాలని సూచించింది.

కాగా దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 4,12,262 కోవిద్ కేసులు నమోదయ్యాయి. 3,980 మంది రోగులు మృతి చెందారు. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 2.1 కోట్లకు చేరింది. ఈ నెల రెండో వారంలో ఈ కేసుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని నిపుణులు అంటున్నారు. దీంతో కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇండియాలో 34.5 కోట్ల యాక్టివ్ కేసులున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన రిపోర్టులో పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Corona AP: ఏపీలో కరోనా కల్లోలం.. నాలుగో రోజు 20 వేలకు పైగా కేసులు.. ఆ జిల్లాలో అత్యధికం..

IPL 2021: నెక్ట్స్ మిగిలిన ఐపీఎల్ అక్కడే నిర్వహిస్తారా… అక్కడైతేనే ఓకే అంటున్న విశ్లేషకులు

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి