LIC Customer Alert : ఎల్‌ఐసీ కస్టమర్లకు గమనిక..! సమయ వేళల్లో మార్పులు.. కొత్త టైం టేబుల్ తెలుసుకోండి..
Note to LIC customers : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లు, ఉద్యోగులు, ఏజెంట్లు ఈ విషయాన్ని తెలుసుకోవాలి.
LIC Customer Alert : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లు, ఉద్యోగులు, ఏజెంట్లు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మే 10 నుంచి కార్యాలయాల పని వేళలు మారబోతున్నాయి. కొత్త సమయాలను గమనించాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు కార్యాలయాలు తెరిచే ఉంటాయని, అయితే ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగుతాయని ట్విట్టర్ వేదికగా తెలిపింది.
2021 ఏప్రిల్ 15 నాటి నోటిఫికేషన్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రతి శనివారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. అన్ని రకాల పాలసీదారులకు, ఇతర వాటాదారులకు ఈ సమాచారాన్ని ముందుగానే చేరవేసింది. ఎల్‌ఐసి తన వెబ్‌సైట్ www.licindia.in ద్వారా ప్రీమియం చెల్లింపు వంటి ఆన్‌లైన్ సదుపాయాలను కూడా అందిస్తోంది. కరోనా సమయంలో వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలి. మీ అవసరాలకు కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్‌లైన్ ద్వారా సేవలను పొందవచ్చు.
ఇదిలా ఉంటే.. ఐడీబీఐ బ్యాంక్ సంక్షోభం నుంచి బయటపడటానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) ఈక్విటీ క్యాపిటల్‌గా రూ.9,300 కోట్లు పెట్టుబడి పెట్టింది. 51% వాటాను కొనుగోలు చేసింది. ఎల్‌ఐసీ స్వాధీనం చేసుకున్న తరువాత దీనిని ప్రైవేట్ బ్యాంకుగా వర్గీకరించారు. ఇప్పుడు ఎల్ఐసికి ఈ బ్యాంక్ పై కమాండ్ ఉంటుంది. అయితే ప్రభుత్వంతో పాటు, ఎల్‌ఐసీ కూడా తన వాటాను విక్రయించడానికి ప్రయత్నిస్తోంది.