Mysterious Deaths: ఆ ఊరిలో 28 మంది అనుమానాస్పదస్థితిలో మృతి.. గ్రామాన్ని దిగ్భంధం చేసిన అధికారులు.. కారణాలపై ఆరా!

హ‌ర్యానాలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని రోజుల వ్యవధిలోనే 28 మంది ప్రాణాలను కోల్పోయారు. రోహ్‌తక్ జిల్లా టిటోలి గ్రామంలో 28 అనుమానాస్పద మ‌ర‌ణాలు సంభ‌వించ‌డంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

Mysterious Deaths: ఆ ఊరిలో 28 మంది అనుమానాస్పదస్థితిలో మృతి.. గ్రామాన్ని దిగ్భంధం చేసిన అధికారులు.. కారణాలపై ఆరా!
Haryana's Rohtak Village With 28 Mysterious Deaths

Rohtak village sealed: హ‌ర్యానాలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని రోజుల వ్యవధిలోనే 28 మంది ప్రాణాలను కోల్పోయారు. రోహ్‌తక్ జిల్లా టిటోలి గ్రామంలో 28 అనుమానాస్పద మ‌ర‌ణాలు సంభ‌వించ‌డంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామానికి చేరుకున్న అధికారులు పరిసరాలను పరిశీలించి గ్రామాన్ని సీజ్ చేశారు. పొరుగు గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి బుధవారం మొత్తం గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు.

టిటోలి గ్రామంలో ఇద్దరు యువ‌కుల‌తో స‌హా రెండు డ‌జ‌న్ల మందికి పైగా మ‌ర‌ణించారు. వీరిలో యువ‌కులకు మ‌ర‌ణించ‌డానికి ముందు రెండు రోజుల పాటు జ్వరం వ‌చ్చిన‌ట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున మ‌ర‌ణాలు సంభ‌వించ‌డంతో గ్రామ‌స్తులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కోవిడ్ వ‌ల్లనే వీరంతా మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు భావిస్తున్నారు.

దీంతో వెంటనే టిటోలి గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించిన తరువాత, జిల్లా యంత్రాంగం గ్రామంలోకి ఎవ‌రిని అనుమ‌తించ‌డం లేదు.. ఊరి వారిని బ‌య‌ట‌కు వెళ్లనివ్వకుండా కట్టిదిట్టం చేశారు. గ్రామ స‌రిహ‌ద్దులో పోలీసుల‌ు మోహ‌రించి పహారా కాస్తున్నారు. బుధవారం 80 మంది నుంచి న‌మునాల‌ను సేకరించిన వైద్యాధికారులు ప‌రీక్షించ‌గా.. వీరిలో 21 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. గ్రామంలో 25 శాతం మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామస్తులందరినీ హోంఐసోలేషన్ చేసి ప్రత్యేక వైద్య బృందాల ద్వారా చికిత్స అందిస్తున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు.

Read Also….  రాత్రిళ్లు భక్తుల ప్రాణాలను తీసే అమ్మవారి ఆలయం.. నైట్ అయితే చాలు భయంతో పారిపోతున్న జనం.. ఆ గుడి ఎక్కడుందంటే..