- Telugu News Photo Gallery Spiritual photos Maihar devi temple in madya pradesh here is the temple history
రాత్రిళ్లు భక్తుల ప్రాణాలను తీసే అమ్మవారి ఆలయం.. నైట్ అయితే చాలు భయంతో పారిపోతున్న జనం.. ఆ గుడి ఎక్కడుందంటే..
దేవాలయాలకు వెళితే.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా.. కోరుకున్న కోరికలు తీరడానికి, ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని వేడుకోవడానికి ఆలయాలకు వెళ్తుంటారు. కానీ ఓ దేవాలయంలోకి వెళ్తే మాత్రం ప్రాణాలు పోతాయట. అది కూడా కేవలం రాత్రిళ్లు మాత్రమే. మరీ ఆ గుడి రహస్యాలు ఎంటో తెలుసుకుందామా.
Updated on: May 06, 2021 | 7:44 PM

మధ్యప్రదేశ్లోని భోపాల్ సమీపంలో ఉన్న సాత్నా జిల్లాలో మైహర్ దేవాలయం ఉంది. అందులో శారద అమ్మవారు కొలువై ఉన్నారు.

అమ్మవారి ఆలయం త్రికూట్ అనే కొండల మధ్య ఉంది. ప్రతి సంవత్సరం శారద దేవిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు.

అయితే ఈ దేవాలయం గురించి అనేక కథలు ఉన్నాయి. ఇక్కడ రాత్రిపూట ఉండాలంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే అని చెబుతుంటారు. రాత్రిళ్లు ఉన్నవారి ప్రాణాలు పోతాయని అక్కడివారి నమ్మకం.

అయితే దీనివెనుక ఒక కథ ఉంది. శారద దేవి భక్తులైన ఆలహ, ఉదమ్ అనే ఇద్దరు సోదరుల ఆత్మలు అక్కడ తిరుగతాయట. పూర్వం వీరిద్ధరి ఆత్మలతో పృథ్వీరాజ్ చౌహాన్ సైతం పోరాడట. అంతేకాకుండా వీరిద్దరె మైహర్ దేవాలయాన్ని కనుగొన్నారట.

అయితే రాత్రిళ్లు ఈ ఆలయాన్ని పూసివేస్తారట. ఇక రాత్రి సమయంలో ఆ ఇద్దరు సోదరులు అమ్మవారిని పూజిస్తారట.

అందుకే రాత్రిళ్లు ఆ దేవాలయం దగ్గర ఎవరు ఉండరు. ఒకవేళ సాహసం చేసి ఎవరైన ఉంటే.. వారు మరుసటి రోజు ప్రాణాలతో ఉండరు అని అక్కడి భక్తులు నమ్ముతుంటారు.

మైహర్ దేవి ఆలయం..




