- Telugu News Photo Gallery Spiritual photos Femous temples of goddess durga in india with unbelievable truths
మనదేశంలో ఉన్న నమ్మశక్యం కానీ అత్యంత ప్రసిద్ధి చెందిన దుర్గా దేవి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..
మనదేశంలో దుర్గా దేవి ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందిన.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలతో ఉన్న దుర్గ దేవాలయాలు కూడా ఉన్నాయి. మరీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందామా.
Updated on: May 05, 2021 | 8:29 PM

కుసవున్ హిమాలయాలలో కసర్ కొండలపై అల్మోరా జిల్లాలో కసార్ దేవి ఆలయం ఉంది. దేవదార్, ఫైన్ అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ స్థలం హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని బందర్ పంచ్ నిఖరం నుంచి అల్మోరా, హవల్ బాగ్ లోయ, హిమాలయాలను చూడొచ్చు. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో ఉన్న ధూని దహనం చేసే బూడిద మానసిక వ్యాధులను నయం చేస్తుందని విశ్వసిస్తుంటారు. 2013లో నాసా శాస్త్రవేత్తల బృందం ఆలయాన్ని సందర్శించి.. ఇక్కడి అయస్కాంత శక్తి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆలయంలోని వాన్ అలాన్ బెల్డ్ లో ఒక భాగం.. పెరూలోని మచుపిచు, ఇంగ్లాండులోని స్టోన్ హెంచ్ మాదిరిగానే ఎలక్ట్రో మాగ్రెటిక్ కణాలున్నాయని తెల్చారు.

ధారి దేవి.. కళ్యసౌర్ గ్రామంలోని అలకనంద నది ఒడ్డున శ్రీనగర్, రుద్రప్రయాగ్ మధ్య ధారి దేవి ఆలయం ఉంది. ఆమె ఉత్తరాఖండ్ సంరక్షక దేవిగా అంటారు. అయితే ఇక్కడ అమ్మవారి ఎగువ శరీరాన్ని మాత్రమే పూజిస్తారు. దిగువ శరీరం వేరే చోట ఉందని.. తీవ్రమైన వరద వలన అమ్మవారి శరీరం కోట్టుకుపోయిందని అంటుంటారు. ఇక్కడి అమ్మవారి ముఖం.. ఉదయం బాలికగా, మధ్యాహ్నం మహిళగా.. సాయంత్రం వృద్దురాలిగా కనిపిస్తుందట.

జ్వాలా దేవి.. ధర్మశాల నుండి 56 కిలోమీటర్ల దూరంలో హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలా దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం ఎప్పుడూ మంటల్లో సహజంగా ఆహుతి అవుతుంది. పురాణాల ప్రకారం అక్బర్ చక్రవర్తి ఈ దేవాలయానికి బంగారు గొడుగును దానం చేశాడట. ఇది దేవి ఇష్టంతో తెలియని లోహంగా మారిపోయింది. ఇక ఇక్కడి మంటలను ఆర్పడానికి పూర్వం కొంతమంది ప్రయత్నించి నీటిని పోసినా కూడా మంటలు ఆరిపోలేదు.

కర్ణి మాతా.. రాజస్థాన్ లోని బికానెర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్నోక్ వద్ద ఈ ఆలయం ఉంది. దీనిని టెంపుల్ ఆఫ్ ఎలుక అని పిలుస్తారు. ఇక్కడ సుమారు 25000 నల్ల ఎలుకలు, తెల్ల ఎలుకలు ఉన్నాయి. ఎలుకలను కబ్బాస్ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం కర్ణి మాతా దేవిక అవతారం. ఒక రోజు, ఆమె సోదరి కొడుకు నీరు త్రాగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చెరువులో మునిగిపోయాడు. బాలుడి జీవితాన్ని పునరుద్ధరించాలని కర్ణి మాతా మనుష్యుల దేవుడైన యముడిని వేడుకుంది. దీంతో ఆమె వంశంలోని మగ పిల్లలందరూ మనుషులుగా పుట్టకముందే ఎలుకలుగా పుడతారని యముడు చెప్పాడట. ఇక్కడ ఎలుకలతో ఇప్పటివరకు ఎలాంటి వ్యాధులు రాలేదు.

కామాఖ్యా దేవి.. గౌహతి.. అస్సాంలోని గౌహతిలోని నీలాచల్ కొండపై కామాఖ్యా దేవత ఆలయం ఉంది. శిఖరం, గర్బగృహంలోపల దేవత రాతి విగ్రహాన్ని పూజించరు. అందుకు బదులుగా స్త్రీ జననేంద్రియ ఆకారంలో ఉన్న రాతిని పూజిస్తారు. స్త్రీ జననేంద్రియ ఆకారంలో ఉన్న రాయి పగలు సమయంలో భూగర్బం నుంచి నీటితో నిండి ఉంటుంది. అలాగే ప్రతి ఏడాది జూన్లో అంబుబ్బి మేళా అనే ఉత్సవాన్ని జరుపుతుంటారు.

దుర్గా దేవి..




