పెళ్ళి చేసుకున్న పాపులర్ కమెడియన్స్.. 9 రోజుల తర్వాత షాకిచ్చిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఒకవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న.. మరోవైపు పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు. కరోనా నియమాలను పాటిస్తూ... అతి తక్కువ మంది సన్నిహితుల

పెళ్ళి చేసుకున్న పాపులర్ కమెడియన్స్.. 9 రోజుల తర్వాత షాకిచ్చిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Sugand Mishra
Follow us
Rajitha Chanti

|

Updated on: May 06, 2021 | 6:53 PM

ఒకవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న.. మరోవైపు పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు. కరోనా నియమాలను పాటిస్తూ… అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి తంతు కార్యక్రమాలను జరిపించేస్తున్నారు. సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రెటీలు సైతం ఈ కరోనా కాలంలో పెళ్లి చేసుకుంటారు. తాజాగా కరోనా కాలంలో పెళ్లి చేసుకున్న కమెడియన్ జంటకు పంజాబ్ పోలీసులు షాకిచ్చారు. పెళ్లయిన తొమ్మిది రోజుల తర్వాత పోలీసులు ఆ నవ దంపతులపై కేసు నమోదు చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారిపై కేసు నమోదు చేశారు. మాస్క్ ధరించకపోవడం, పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు వివాహ వేడుకకు వచ్చారని పోలీసులు గుర్తించారు.

Sanket

వివరాల్లోకెళితే.. హిందీలో ప్రసారమయ్యే కపిల్ శర్మ షో ద్వారా పాపులరైన హాస్యనటులు సంకేత్ భోంస్లే, సుగంధ మిశ్రా ఇటీవల వివాహం చేసుకున్నారు. అంగరంగ జరిగిన వీరి వివాహ వేడుకకు పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు పాల్గోన్నారు. అయితే వీరు పెళ్ళి సమయంలో కరోనా జాగ్రత్తలు పాటించలేదు. దీన్ని ఓ వీడియో ద్వారా గుర్తించిన అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం 188 సెక‌్షన్‌ కింద వారిపై కేసు నమోదు చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన గాయని సుగంధ మిశ్రాను అదే ప్రాంతంలోని ఓ ఫంక‌్షన్‌ హాల్‌లో ఏప్రిల్‌ 26వ తేదీన వివాహం జరిగింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం వివాహాలు, శుభకార్యలపై నిబంధనలు విధించింది. 10 మంది కన్నా ఎక్కువగా సభ్యులు ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే వీరి పెళ్ళిలో మాత్రం నిబంధనలకు మంచి అధికంగా బంధులు, స్నేహితులు పాల్గోన్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్న ఓ వీడియో ద్వారా పోలీసులు గుర్తించారు. ఇక ఆ వీడియో ఆధారంగా ఆ నవ దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సరబ్‌జిత్‌ సింగ్‌ బహియా తెలిపారు. పగ్వారా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కేసు నమోదైంది.

Also Read: మాటలు వినలేం.. ఫోన్ కూడా రాదు.. నా జీవితంలో అతి పెద్ద దుర్దినం ఇదే.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖా వాణి కూతురు

విక్రమ్ వేదకు ఏమైంది…? అడ్డంకులను దాటి రీమేక్ అయ్యేదెప్పుడు ? చిరు, నాగ్ కాంబో వచ్చేనా..