Attacked on Muralidharan: బెంగాల్‌లో యథేచ్చగా హింస.. కేంద్ర మంత్రి మురళీధరన్‌ వాహనంపై దాడి.. కారు ధ్వంసం, పలువురికి గాయాలు

బెంగాల్‌లో ఎన్నికల తరువాత కూడా హింస యథేచ్చగా కొనసాగుతోంది. పశ్చిమ మిడ్నాపూర్‌లో కేంద్ర మంత్రి మురళీధరన్‌ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Attacked on Muralidharan: బెంగాల్‌లో యథేచ్చగా హింస.. కేంద్ర మంత్రి మురళీధరన్‌ వాహనంపై దాడి.. కారు ధ్వంసం, పలువురికి గాయాలు
Muralidharan's Convoy Attacked In Bengal
Follow us

|

Updated on: May 06, 2021 | 3:58 PM

Minister V Muralidharan’s convoy attacked: బెంగాల్‌లో ఎన్నికల తరువాత కూడా హింస యథేచ్చగా కొనసాగుతోంది. పశ్చిమ మిడ్నాపూర్‌లో కేంద్ర మంత్రి మురళీధరన్‌ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విదేశాంగశాఖ సహాయ మంత్రి కాన్వాయ్‌పై రాళ్లతో , కర్రలతో దాడి చేశారు దుండుగులు. ఇది ముమ్మాటికి తృణమూల్‌ కార్యకర్తల పనేనని ఆరోపించారు మంత్రి మురళీధరన్‌.

ఈ దాడిలో మురళీధరన్‌ కారు డ్రైవర్‌తో సహా పలువురు వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. తీవ్ర ఉద్రిక్తత మధ్య కేంద్రమంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. బెంగాల్‌లో హింసపై నివేదిక తయారు చేయడానికి కేంద్ర హోంశాఖ బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్న రోజునే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. బెంగాల్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత 10 మంది బీజేపీ కార్యకర్తలు గురయ్యారని ఆ పార్టీ నేతలు.

దాడిలో మురళీధరన్‌ కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. బెంగాల్‌లో పరిస్థితిని సమీక్షించడానికి వెళ్లిన సమయంలో ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగిందని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆయన తన పర్యటనను అర్థాంతరంగా కుదించుకున్నట్లు తెలిపారు. ఈ వివరాలను మురళీధరన్ గురువారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. పంచకుడిలోని స్థానికులు తన కాన్వాయ్‌పై దాడి చేశారని, కార్ల అద్దాలను పగులగొట్టారని, తన వ్యక్తిగత సిబ్బందిని గాయపరిచారని మురళీధరన్ ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. ఇది టీఎంసీ గూండాల పనేనని ఆయన ఆరోపించారు.

ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతల పరిస్థితులపై గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి తీవ్ర స్థాయిలో హింస చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

Read Also..