New Zealand PM Jacinda Ardern: ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కనున్న న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్.. ఎప్పుడంటే
న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఆమెకు ఈ వయసులో పెళ్లి గౌనులో కనిపించడం ఇబ్బంది ఉంటుంది అని అనుకుంటున్నారు...
న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఆమెకు ఈ వయసులో పెళ్లి గౌనులో కనిపించడం ఇబ్బంది ఉంటుంది అని అనుకుంటున్నారు… కనుక పెళ్లి ముస్తాబులు ఏమీ ఉండవు అని ఆమె ప్రకటించారు. జసిండాకు రెండేళ్ల కూతురు ఉంది. ఇప్పుడామె తన బాయ్ ఫ్రెండ్, బిడ్డ తండ్రి అయిన వ్యక్తినే వివాహమాడబోతున్నారు. జూన్ 21 న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ కూతురు నీవ్ తియారహ మూడో పుట్టిన రోజు. మూడు నిండి నాలుగు వస్తుంది. ఈ తల్లికూతుళ్లతో కలిసి వెల్లింగ్టన్‌లోని అధికార నివాసం ప్రీమియర్ హౌస్‌లో క్లార్క్ గేఫోర్డ్ అనే వ్యక్తి కూడా ఉంటారు.
వచ్చే సమ్మర్‌లో జసిండా, క్లార్ పెళ్లి చేసుకోబోతున్నారు. న్యూజీలాండ్‌లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వేసవి నెలలు. ఆ మూడు నెలల్లో ఏదో ఒక రోజు క్లార్క్.. ఇంటి సభ్యుడు అనే హోదా నుంచి జెసిండా భర్త హోదా పొందబోతున్నారు. పెళ్లి తేదీ ఫిక్స్ అయింది. అయితే పెళ్లికి పిలకవక పోయినా నొచ్చుకోని ఆత్మీయులు ఎవరైతే ఉంటారో ఆ జాబితాను తయారు చేశాక మాత్రమే పెళ్లి తేదీని బహిర్గతం చేస్తామని కోస్ట్ రేడియో ప్రతినిధితో జసిండా అన్నట్లు న్యూజీలాండ్ హెరాల్డ్ పత్రిక వెల్లడించింది.
రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పెళ్లి ఇది. 2019 ఈస్టర్ సెలవుల్లోనే జసిండా, క్లార్క్‌ల నిశ్చితార్థం జరిగింది. నిజానికి నిశ్చితార్థం కూడా వాయిదా పడుతూ వస్తోంది! 2017 అంతా జసిండా బిజీ. ఆ ఏడాదే, జసిండా తన ముప్పై ఆరేళ్ల వయసులో న్యూజీలాండ్ ప్రధాని అయ్యారు. ఆ దేశానికి అతి చిన్న వయసులో ప్రధాని అయిన తొలి మహిళ జసిండా. తర్వాత 2018 అంతా బిజీ. తల్లి కావడం, ప్రధాని బాధ్యతలతో పాటు.. తల్లి బాధ్యతల్నీ నెరవేర్చడం… బిడ్డ పుట్టాక నిశ్చితార్థం జరిగినా, పెళ్లి వరకు రావడానికి మళ్లీ ఒక ఆటంకం… కరోనా కట్టడిలో జసిండా బిజీ అయిపోయారు.
దేశంలోని యాభై లక్షల మంది జనాభాను కరోనా నుంచి కాపాడేందుకు క్షణం తీరిక లేకుండా పనిచేశారు. 2012లో తొలిసారి జసిండా, క్లార్క్ ఒకరికొకరు పరిచయం అయ్యారు. అప్పుడామె లేబర్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. పరిచయం తర్వాత కొన్నాళ్లకు క్లార్క్ జసిండాను కలిశారు. వివాదాస్పద గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ బ్యూరో బిల్ గురించి వివరాల కోసం వచ్చారు ఆయన. మీడియా కనుక ఏదో స్టోరీ పని మీద అయుండొచ్చు. అలా వాళ్ల స్నేహం మొదలైంది. ఆమె ఫెమినిస్టు. ఆయన హ్యూమనిస్టు. స్థూలంగా ఇద్దరూ ఒకటే. ఏడేళ్ల స్నేహం తర్వాత 2019లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన నేటికీ నెరవేరలేదు. ఇప్పుడు మళ్లీ జూన్ 21న పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు అత్యధికం ఈ జిల్లాలోనే… పూర్తి వివరాలు