Coronavirus: తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు అత్యధికం ఈ జిల్లాలోనే… పూర్తి వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతన్నాయి. ఆస్పత్రుల్లో...
తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతన్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరక్క రోగులు అల్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా 30 జిల్లాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు డేటా విడుదల చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడు జిల్లాలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లిస్టులో ఏపీలోని చిత్తూరు 11, శ్రీకాకుళం 16, తూర్పుగోదావరి 17, గుంటూరు 19, విశాఖపట్నం 27, అనంతపురం 29, కర్నూలు 30వ స్థానంలో ఉన్నాయి.
ఏపీ వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం కొత్తగా 1,16,367 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. రికార్డు స్థాయిలో 22,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2344 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో అనంతపురం (2304), విశాఖపట్నం (2113), ప్రకాశం (2001), కర్నూలు (1985) ఉన్నాయి. కాగా మొత్తం పాజిటివ్ కేసుల అంశాన్ని పరిశీలిస్తే.. 152625 కేసులతో తూర్పు గోదావరి జిల్లా టాప్ ప్లేసులో ఉంది.
తెలంగాణలో కొత్తగా 79,824 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. కొత్తగా 6,026 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే పలు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1,115 కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 418, రంగారెడ్డి జిల్లాలో 403 కేసులు, నల్గొండ జిల్లాలో 368, సంగారెడ్డి జిల్లాలో 235 రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
Also Read: తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు.. అత్యధిక కేసులు నమోదైన జిల్లాలు ఇవే