ఢిల్లీ సరిహద్దులోని తిక్రీ వద్ద నిరసన చేస్తున్న మహిళ కోవిడ్-19 తో మృతి, అన్నదాతల్లో భయం

ఢిల్లీ బయట తిక్రీ బోర్డర్లో వందలాది రైతులతో బాటు గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్న 25 ఏళ్ళ మహిళ కోవిడ్-19 తో మృతి చెందింది. ఆమెను మోమిత గా గుర్తించినట్టు హర్యానా ప్రభుత్వం తెలిపింది....

ఢిల్లీ సరిహద్దులోని తిక్రీ వద్ద నిరసన చేస్తున్న మహిళ  కోవిడ్-19 తో మృతి, అన్నదాతల్లో భయం
Woman Who Is Protesting At Tikri Border Dies With Covid 19
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 06, 2021 | 1:19 PM

ఢిల్లీ బయట తిక్రీ బోర్డర్లో వందలాది రైతులతో బాటు గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్న 25 ఏళ్ళ మహిళ కోవిడ్-19 తో మృతి చెందింది. ఆమెను మోమిత గా గుర్తించినట్టు హర్యానా ప్రభుత్వం తెలిపింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈమె… ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన రైతుల్లో ఒకరని ప్రభుత్వం పేర్కొంది. గత నెల 26 న మోమిత కరోనా వైరస్ పాజిటివ్ కి గురైందని, జ్వరంతో బాధపడుతున్న ఈమెను మొదట హర్యానా లోని బహదూర్ గఢ్ ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. కానీ అక్కడ బెడ్ లభించకపోవడంతో రోహతక్ లోని హాస్పిటల్ కి తీసుకువెళ్లగా అప్పటికే అది కోవిద్ రోగులతో నిండిపోయిందని వారు చెప్పారు. చివరకు బహదూర్ గఢ్ లోనే మరో హాస్పిటల్ కు చేర్చేటప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించిందన్నారు. కాగా వివాదాస్పదమైన మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాలకు చెందిన రైతులు కొన్ని నెలలుగా సింఘు, తిక్రీ, ఘాజీపూర్ బోర్డర్లలో నిరసన చేస్తున్నారు.ప్రభుత్వంతో 11 దఫాలుగా రైతు సంఘాలు చర్చలు జరిపినప్పటికీ అవి విఫలమయ్యాయి.కనీస మద్దతు ధర కొనసాగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ వారు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు.

ఇలా ఉండగాసుప్రీంకోర్టు కూడా లోగడ ఈ చట్టాల అమలును తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు రైతులు సంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ తమ ఆందోళన దేశవ్యాప్తంగా కొనసాగుతుందని అక్టోబరు వరకు కూడా నిరసన చేస్తామని రైతు సంఘాలు పేర్కొన్నాయి. ఈ మేరకు బీకేయూ నేత తికాయత్ పలుమార్లు ఈ విషయాన్ని ప్రకటించారు.. ఇటీవల ఈయన ఈ బోర్డర్లో కొంతమందికి ఇఫ్తార్ విందునిస్తూ ఇక్కడ ఎవరికీ కోవిడ్ లేదని, ఇన్ని నెలలుగా ఇంకా ప్రొటెస్ట్ చేస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు మోమిత మృతితో రైతుల్లో ఆందోళన నెలకొంది. మరిన్ని చదవండి ఇక్కడ :  ఐడియా అదుర్స్‌ రైతన్న వినూత్న ప్రయోగం వైరల్ అవుతున్న వీడియో ..: Farmer Creative Viral Video.

ఊరు ఊరంతా ఐసోలేషన్‌!ఐసొలేషన్ పాటిస్తూ పొలాల్లో ఉంటున్న సగం ఊరి జనం వీడియో… : viral video.

కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?