అరుణ గ్రహంలో ‘ఫన్నీ శిలలు’, నాసా వారి రోవర్ ‘పర్సేవెరెన్స్’ అన్వేషణలో అన్నీ విచిత్రమే !
అంగారక గ్రహంలో పరిశోధనలు చేస్తున్న నాసా వారి రోవర్ 'పర్సేవెరెన్స్'...విచిత్రంగా, తమాషాగాపరికరంగా ' ఉన్న కొన్ని శిలలు (రాక్స్) ను కనుగొంది. ఫన్నీగా ఉన్న ఈ రాళ్లల్లో కొన్ని ఉహించని షేపులో ఉన్నాయట...
అంగారక గ్రహంలో పరిశోధనలు చేస్తున్న నాసా వారి రోవర్ ‘పర్సేవెరెన్స్’…విచిత్రంగా, తమాషాగాపరికరంగా ‘ ఉన్న కొన్ని శిలలు (రాక్స్) ను కనుగొంది. ఫన్నీగా ఉన్న ఈ రాళ్లల్లో కొన్ని ఉహించని షేపులో ఉన్నాయట. జురాసిక్ అంతమవుతున్న కాలంలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నార్త్ అమెరికాలో తిరుగాడిన డైనోసార్లను ఓ శిల పోలి ఉంది. సారోపాడ్ డైనోసార్ జీన్స్ నుంచి పుట్టిన ‘బ్రాచియోసారస్’ ను పోలి ఉన్న ఓ రాయి మరీ ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది. మరి కొన్ని రాళ్లు తుపాకీ మడమ ‘బట్’ లాగా ఉన్నట్టు నాసా ఇంజనీర్లు గుర్తించారు. గత ఏప్రిల్ 15 న రోవర్ తీసిన వీటి ఇమేజీలను నాసా ఇంజనీర్ కెవిన్ గిల్, జేసన్ మేజర్ తమ ట్విటర్లలో షేర్ చేశారు. అరుణ గ్రహంలో గతంలో నెలకొన్న వాతావరణాన్ని, రసాయన లక్షణాలతో కూడిన శిలలు ఇతర వింతల సమాచారాన్ని ఈ రోవర్ ఎప్పటికప్పుడు భూమికి పంపుతుంటుంది. ఇప్పటికే మట్టి నమూనాలను పంపింది. రోవర్ పంపుతున్న ఇమేజిలను కోట్లాది మంది ఆసక్తిగా చూస్తున్నారు. రాక్ కలెక్టర్లు (రాళ్లను సేకరించేవారు), జియాలజిస్టులు అరుణ గ్రహం పైని శిలలను చూసి ఆశ్చర్యపోతున్నారు. వీరిలో కొందరు లేసర్ పరికరమైన ‘ సూపర్ కామ్ ‘ ని వినియోగించి వీటిని అధ్యయనం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ గ్రహం మీద మానవ ఆవాసాలకు గల అవకాశాలను కూడా రోవర్ స్టడీ చేస్తుందట.
అంగారక గ్రహం పై నీటి జాడలను ఇది ఇదివరకే గుర్తించింది. అప్పటి నుంచి పరిశోధకులకు ఈ అరుణ గ్రహ వింతలపై ఆసక్తి మరింత పెరిగింది. ఇక్కడి క్రేటర్లు,లోతైన ప్రదేశాలను నాసా ఇదివరకే ప్రపంచానికి ‘పరిచయం’ చేసింది.
మరిన్ని చదవండి ఇక్కడ : ఐడియా అదుర్స్ రైతన్న వినూత్న ప్రయోగం వైరల్ అవుతున్న వీడియో ..: Farmer Creative Viral Video.
ఊరు ఊరంతా ఐసోలేషన్!ఐసొలేషన్ పాటిస్తూ పొలాల్లో ఉంటున్న సగం ఊరి జనం వీడియో… : viral video.