Total Lock-down: ఎక్కడిక్కడ లాక్ డౌన్స్.. కేరళ, గోవాల్లో లాక్ డౌన్ ప్రకటనలు.. మే నెలంతా ఇంతేనా?
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక లాక్ డౌన్ ను ప్రకటిస్తే మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధించాయి. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం...
Total Lock-down in Kerala Goa: దేశంలో కరోనా వైరస్ (CORONA VIRUS) రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక లాక్ డౌన్ (PARTIAL LOCK-DOWN) ను ప్రకటిస్తే మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ (NIGHT CURFEW)లు విధించాయి. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం (KERALA GOVERNMENT) కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ (KERALA) కరోనా సెకండ్ వేవ్ (CORONA SECOND WAVE) కేసుల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ (TOTAL LOCK-DOWN) ప్రకటించింది. అదే బాటలో గోవా (GOA) కూడా పయనించింది. నాలుగు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది గోవా ప్రభుత్వం. (GOA GOVERNMENT)
కేరళ రాష్ట్రవ్యాప్తంగా మే 8 ఉదయం 6 గంటల నుంచి మే 16 వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. కేరళలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు సీఎం పినరయి విజయన్ (CHIEF MINISTER PINARAI VIJAYAN) ఒక ప్రకటనలో వెల్లడించారు. కరోనా కట్టడి చేసేందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కోవిడ్ (COVID-19) నిబంధనలు పాటించేలా వార్డు స్థాయి కమిటీలను బలోపేతం చేసే దిశగా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. కరోనా (CORONA) భూతం విపరీతమైన వేగంతో వ్యాపిస్తోందని, రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, కఠిన చర్యలు తప్పవన్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు (CORONA POSITIVITY RATE) ఏమాత్రం తగ్గడంలేదని వెల్లడించారు. కేరళలో నిన్న ఒక్కరోజే 42వేలకు పైగా పాజిటివ్ కేసులు (CORONA POSITIVE CASES) నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 57 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3 లక్షల 56 వేల 872 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 5 వేల మంది కరోనా బారిన పడి మరణించారు. కొత్త కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడం ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల జాబితాలో 10 జిల్లాలతో కేరళ తొలిస్థానంలో ఉంది. దేశంలో అత్యధిక కేసులు పెరుగుతున్న 24 రాష్ట్రాల్లో మొదటి నాలుగు స్థానాల్లో కేరళ రెండో స్థానంలో ఉంది.
మన దేశంలోని అందమైన సముద్రతీర పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది గోవా. ఇప్పుడు అక్కడ కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 51 శాతానికి పెరిగింది. దేశంలో కరోనా వైరస్ అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో గోవా ఒకటిగా మారింది. గోవాలో ఇపుడు కరోనా వైరస్ విజృంభణ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గత నెలతో పోలిస్తే ఇక్కడ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఏప్రిల్‌లో ఇక్కడ కరోనా పాజిటివిటీ రేటు 40 శాతంగా ఉండగా, ఇప్పుడిది 51 శాతానికి పెరిగింది. మున్ముందు ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుండగా, పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తర్వాత హర్యానా రెండోస్థానంలో ఉంది. ఇక్కడ పాజిటివిటీ రేటు 37 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో గోవా ప్రభుత్వం నాలుగు రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. మే 6వ తేదీ సాయంత్రం నుంచి 10వ తేదీ సోమవారం ఉదయం వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. అత్యవసర సేవలు, పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చినట్టు చెప్పారు. అయితే ప్రజారవాణాకు అనుమతి లేదని స్పష్టంచేశారు.
ఇదిలా ఉంటే, వైరస్ తీవ్రతను అదుపులోకి తెచ్చేందుకు ఏప్రిల్ 29నుంచి ఐదు రోజులపాటు గోవాలో లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేశారు. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం లక్ష కేసులు నమోదుకాగా ప్రస్తుతం 26వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 1372 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి నమోదువుతున్న పాజిటివిటీ రేటు వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో అనే విషయాన్ని కళ్లకు కడుతోందని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (CHIEF MINISTER PROMOD SAWANTH) వ్యాఖ్యానించారు. ఇక్కడ కేసులు తగ్గుముఖం పట్టాలంటే కఠిన లాక్‌డౌన్, పర్యాటకులకు అనుమతుల నిరాకరణ వంటి చర్యలే మార్గమన్నారు. ఇక్కడ అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్న మాట వాస్తవమే అని… రాష్ట్రానికి ఆక్సిజన్ (OXYGEN), అదనపు ఔషధాలు, చికిత్సా పరికరాలు పంపాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.