CORONA SECOND-WAVE: ఆ ముప్పై జిల్లాల్లోనే కరోనా విజృంభణ.. ఏపీలో ఏడు జిల్లాల్లో పరిస్థితి దారుణం

దేశంలో గడచిన రెండు వారాల వ్యవధిలో 30 జిల్లాల్లో అత్యంత వేగంగా కరోనా విస్తరిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ 30 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏడు జిల్లాలు ఉన్నట్టు తెలిపారు.

CORONA SECOND-WAVE: ఆ ముప్పై జిల్లాల్లోనే కరోనా విజృంభణ.. ఏపీలో ఏడు జిల్లాల్లో పరిస్థితి దారుణం
Coronavirus In Ap
Follow us
Rajesh Sharma

| Edited By: Anil kumar poka

Updated on: May 06, 2021 | 12:22 PM

CORONA SECOND-WAVE IN THIRTY DISTRICTS: దేశంలో కరోనా విలయతాండవం (CORONA PANDEMIC) కొనసాగుతోంది. రోజువారీ కేసులు మూడు రోజులు తగ్గినట్టే తగ్గి మే 6న మళ్ళీ పెరిగాయి. దేశవ్యాప్తంగా 4 లక్షల 13 వేల కేసులు తాజాగా నమోదయ్యాయి. దాదాపు 4 వేల మంది ఒక్క రోజు వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా, దేశంలో గడచిన రెండు వారాల వ్యవధిలో 30 జిల్లాల్లో అత్యంత వేగంగా కరోనా (CORONA) విస్తరిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ 30 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ (ANDHRA PRADESH) నుంచి ఏడు జిల్లాలు ఉన్నట్టు తెలిపారు.

అత్యధిక కేసులు పెరుగుతున్న 24 రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక (KARNATAKA), కేరళ (KERALA), తమిళనాడు (TAMILNADU), ఆంధ్రప్రదేశ్‌లు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో అత్యధిక యాక్టివ్ కేసుల రాష్ట్రాల జాబితాలో ఏపీ (AP) 6వ స్థానంలో ఉంది. 20 శాతానికిపైగా పాజిటివిటీ రేటు (POSITIVE RATE) నమోదైన 16 రాష్ట్రాల్లో ఏపీ 13వ స్థానంలో ఉంది. పొరుగున ఉన్న తెలంగాణ (TELANGANA)లో రోజువారీ కేసుల తగ్గుతుండగా… ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. మొత్తం 24 రాష్ట్రాల్లో రోజువారీ కేసుల పెరుగుదల అధికంగా ఉండగా… అందులో ఏపీ 4వ స్థానంలో నిలిచింది.

మహారాష్ట్ర (MAHARASHTRA), ఉత్తర్‌ప్రదేశ్‌ (UTTARPRADESH), ఢిల్లీ (DELHI), ఛత్తీస్‌గడ్‌ (CHATTISGARH), గుజరాత్‌ (GUJARAT), మధ్యప్రదేశ్‌ (MADHYA PRADESH), తెలంగాణ, ఝార్ఖండ్‌ (JHARKHAND), డయ్యూ డామన్‌ (DIU DAMAN), లడఖ్‌ (LADAKH), లక్ష్యద్వీప్‌ (LAKSHYADWEEP), అండమాన్‌ నికోబార్‌ (ANDMAAN NICOBAR) దీవుల్లో రోజువారీ కేసుల గ్రాఫ్‌ తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులు నమోదు చేస్తున్న మహారాష్ట్రలోని పుణే (PUNE), థానే (THANE), ముంబయి (MUMBAI), లాతూర్‌ (LATUR), ఔరంగాబాద్‌ (AURANGABAD), భండారా (BHANDARA), ముంబయి సబర్బన్‌, నాందేడ్‌ (NANDED), గోండియా, ధూలే, నందూర్బార్‌ జిల్లాలు, మధ్యప్రదేశ్‌లో 8, ఛత్తీస్‌గడ్‌లో 3, ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు, ఝార్ఖండ్‌, లేహ్‌ (LEH), లడఖ్‌, గుజరాత్‌ల్లో ఒక్కో జిల్లాలోనూ కేసులు తగ్గుముఖం పట్టాయి.

ఇదే సమయంలో 9 రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో కేసులు వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వీటిలో బెంగుళూరు అర్బన్‌ (BENGALURU URBAN), చెన్నై (CHENNAI), కేరళలోని కోజికోడ్‌ (KOZIKOD)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో చిత్తూరు (CHITTUR), శ్రీకాకుళం (SRIKAKULAM), తూర్పుగోదావరి (EAST GODAVARI), గుంటూరు (GUNTUR), విశాఖపట్నం (VISAKHAPATNAM), అనంతపురం (ANANTAPUR), కర్నూలు (KURNOOL) జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ జాబితాలో 10 జిల్లాలతో కేరళ తొలి స్థానంలో, 7 జిల్లాలో ఏపీ రెండోస్థానంలో ఉంది. కర్ణాటకలో 3, తమిళనాడులో 2, హరియాణాలో 2, మహారాష్ట్రలో 2, మధ్యప్రదేశ్‌లో 2, బిహార్‌, ఉత్తరాఖండ్‌‌లో ఒక్కో జిల్లా ఉంది.