Corona Second Wave: దేశంలోనే అత్యధిక ప్రమాదకరంగా ఆ 30 జిల్లాలు.. అందులో 7 మనవే…

ఏపీలో కోవిడ్ సెకెండ్ వేవ్ మరింత అధికంగా ఉంది. ఆ ఏడు జిల్లాల్లో మాత్రం కోవిడ్ అత్యధిక వేగంగాతో విస్తరిస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Corona Second Wave: దేశంలోనే అత్యధిక ప్రమాదకరంగా ఆ 30 జిల్లాలు.. అందులో 7 మనవే...
Ap Corona
Follow us
Sanjay Kasula

| Edited By: Team Veegam

Updated on: May 06, 2021 | 10:27 AM

దేశం కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఊపిరందక సతమతమవుతోంది. ఇంత కాలం ఒకటి… ఇక ముందు మరొకటి అన్నట్లుగా కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 30 జిల్లాల్లో… ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏడు జిల్లాలు ఈ ప్రభావంలో ఉన్నాయి. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధిక క్రియాశీల కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానంలో నిలిచింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఈ వివరాలను వెల్లడించారు. అత్యధిక క్రియాశీలక కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానంలో నిలిచింది.

ఇందులో 20శాతంకిపైగా పాజిటివిటీ రేటు నమోదైంది. 16 రాష్ట్రాల్లో ఏపీ 13వ స్థానంలో కొనసాగుతోంది . తెలంగాణలో రోజువారీ కరోనా కేసుల గ్రాఫ్‌ మారుతుండగా… ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పైపైకి పెరుగుతోంది. మొత్తం 24 రాష్ట్రాల్లో రోజువారీ కేసుల పెరుగుదల అధికంగా ఉండగా… అందులో ఏపీ 4వ స్థానంలో నిలిచింది.

ఇదే సమయంలో 9 రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇందులో బెంగుళూరు అర్బన్‌, చెన్నై, కేరళలోని కోళికోడ్‌లు తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో మాత్రం మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఏపీలోని చిత్తూరు 11, శ్రీకాకుళం 16, తూర్పుగోదావరి 17, గుంటూరు 19, విశాఖపట్నం 27, అనంతపురం 29, కర్నూలు 30వ స్థానంలో ఉన్నాయి.

ఏపీలోని ఆ ఏడు జిల్లాల్లో కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..

ఏప్రిల్ 13 నుంచి మే 3 వరకు చిత్తూరు జిల్లాలో 6,843 నుంచి 16,315 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళంలో 5,435 నుంచి 13,567 కేసులు, తూర్పు గోదావరి జిల్లా 4,300 నుంచి ఒక్కసారిగా 13,458 కోవిడ్ కేసులు వచ్చాయి. ఇక గుంటూరు, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దాదాపు 3 వేల కేసుల నుంచి 13 వేలకు పైగా కరోనా కేసులు వచ్చినట్లుగా లెక్కలు చెబతున్నాయి.

7 జిల్లాలతో ఏపీ రెండోస్థానంలో ఉంది. అయితే   కేరళలోని 10 జిల్లాల్లో కరోనా వేగం అధికంగా ఉండటంతో మొదటి స్థానంలో ఉంది. కర్ణాటక నుంచి 3, తమిళనాడు నుంచి 2, హరియాణా నుంచి 2, మహారాష్ట్ర నుంచి 2, మధ్యప్రదేశ్‌ నుంచి 2, బిహార్‌, ఉత్తరాఖండ్‌ నుంచి ఒక్కో జిల్లా ఉన్నాయి.

ఇక మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, ఢిల్లీ, ఛత్తీస్‌గడ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఝార్ఖండ్‌, దయ్యూదామన్‌, లద్ధాఖ్‌, లక్ష్యద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో కేసుల గ్రాఫ్‌ నేలచూపులు చూస్తోంది. అదే అత్యధిక కేసులు పెరుగుతున్న 24 రాష్ట్రాల్లో మొదటి నాలుగు స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులు నమోదు చేస్తున్న మహారాష్ట్రలోని పుణే, థానే, ముంబై , లాతూర్‌, ఔరంగాబాద్‌, భండారా, ముంబై సబర్బన్‌, నాందేడ్‌, గోండియా, ధూలే, నందూర్బార్‌ జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లో 8, ఛత్తీస్‌గడ్‌లో 3, ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు, ఝార్ఖండ్‌, లేహ్‌లద్ధాఖ్‌, గుజరాత్‌ల్లో ఒక్కో జిల్లాలోనూ కేసులు తగ్గుముఖం పట్టాయి.

ఇదిలావుంటే… బుధవారం ఒక్క రోజే  రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. 22వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,16,367 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. రికార్డు స్థాయిలో 22,204 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 85 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య.. 12,03,337 కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనాతో 8,374 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షన్నరకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో బుధవారం నుంచి ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

ఉదయం వేళ కూడా కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. కఠినంగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం అనంతరం ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న వాహనాలను అడ్డుకొని వెనెక్కి పంపించారు. దీంతో జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.

Also Read:

Sanitizer Test: మీరు వాడుతోన్న శానిటైజ‌ర్ మంచిదేనా..? ఈ సింపుల్ టెక్నిక్‌తో తెలుసుకోండి..

AP Banks Working: ఏపీలో బ్యాంకర్ల సంచలన నిర్ణయం..ఈ రోజు నుంచి బ్యాంకుల సమయాల్లో మార్పులు..!