Sanitizer Test: మీరు వాడుతోన్న శానిటైజ‌ర్ మంచిదేనా..? ఈ సింపుల్ టెక్నిక్‌తో తెలుసుకోండి..

Sanitizer Test: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌నుషుల అల‌వాట్లు మారిపోయాయి. ప్ర‌స్తుతం నోటికి మాస్కు లేని వారు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నారు. పెరుగుతోన్న క‌రోనా కేసులు ప్ర‌జ‌లను ఈ కొత్త అల‌వాట్ల‌కు..

Sanitizer Test: మీరు వాడుతోన్న శానిటైజ‌ర్ మంచిదేనా..? ఈ సింపుల్ టెక్నిక్‌తో తెలుసుకోండి..
Sanitizer Quality
Follow us

|

Updated on: May 06, 2021 | 6:05 AM

Sanitizer Test: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌నుషుల అల‌వాట్లు మారిపోయాయి. ప్ర‌స్తుతం నోటికి మాస్కు లేని వారు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నారు. పెరుగుతోన్న క‌రోనా కేసులు ప్ర‌జ‌లను ఈ కొత్త అల‌వాట్ల‌కు మ‌ళ్లించాయి. ఇక మాస్కుతో పాటు శానిటైజ‌ర్ వినియోగం కూడా స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. ఎక్క‌డికి వెళ్లినా.. జేబులో శానిటైజ‌ర్ పెట్టుకొని వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఏ వ‌స్తువును తాకినా వెంట‌నే జేబులో నుంచి శానిటైజ‌ర్ బాటిల్ తీసుకొని చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. మ‌రి మీరు వాడుతోన్న శానిటైజ‌ర్ ఎంత వ‌ర‌కు క్వాలిటీతో ఉందో ఎప్పుడైనా ఆలోచించారా.? శానిటైజ‌ర్ క్వాలిటీ మ‌న‌కు ఎలా తెలుస్తుంద‌నేగా మీ సందేహం. ఒక చిన్న టెక్నిక్‌తో మీ శానిటైజ‌ర్ మంచిదేనా ఇట్టే చెప్పెయొచ్చు అదేలాగో తెలుసుకుందాం. ఇందుకోసం ఒక హెయిర్ డ్ర‌య‌ర్‌ను తీసుకోవాలి. అనంత‌రం.. ఒక పాత్ర‌లో మీరు వాడుతోన్న శానిటైజ‌ర్‌, మ‌రో పాత్ర‌లో నీటిని తీసుకోవాలి. హెయిర్ డ్రయర్‌తో శానిటైజర్ ను ముప్పై సెకండ్లపాటు డ్రై చేయాలి. అలాగే నీటిని కూడా డ్రై చేయాలి. ఒక‌వేళ నీటికంటే త్వ‌ర‌గా శానిటైజ‌ర్ ఆవిరైపోతే అది మంచి క్వాలిటీ ఉన్న శానిటైజ‌ర్ అని నిర్ణ‌యానికి రావొచ్చు. దీంట్లో లాజిక్ ఎంట‌నీ ఆలోచిస్తున్నారా.? అక్క‌డికే వ‌స్తున్నాం.. ఆల్కహాల్ బాయిలింగ్ పాయింట్ నీటితో పోలిస్తే చాలా తక్కువ. ఆల్కహాల్ బాయిలింగ్ పాయింట్ 78డిగ్రీల సెల్సియస్ కాగా, నీటిది వంద డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. దీని ఆధారంగా ఆల్క‌హాల్ ఉన్న శానిటైజ‌ర్ త్వ‌ర‌గా ఆవిరికావాలి. శానిటైజ‌ర్‌లో ఆల్క‌హ‌ల్ ఉంటేనే అది మంచిద‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే.

Also Read: Viral Video: వామ్మో.. సైకిల్‌పై స్టంట్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.. వీడియో వైరల్

ఎండాకాలంలో జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా ? అయితే ఈ సులభమైన టిప్స్ ఫాలో అవ్వండి..

కరోనా కాలంలో ఇంట్లో ఉండే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే రిజల్ట్ పక్కా..