Viral Video: వామ్మో.. సైకిల్‌పై స్టంట్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.. వీడియో వైరల్

A person riding a bicycle on bridge: ఇంటర్నెట్ ప్రపంచంలో.. నిత్యం వింతవింత సంఘటనలు జరుగుతుంటాయి. అయితే.. కొన్నింటిని చూసి అందరూ

Viral Video: వామ్మో.. సైకిల్‌పై స్టంట్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.. వీడియో వైరల్
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 05, 2021 | 9:50 PM

A person riding a bicycle on bridge: ఇంటర్నెట్ ప్రపంచంలో.. నిత్యం వింతవింత సంఘటనలు జరుగుతుంటాయి. అయితే.. కొన్నింటిని చూసి అందరూ నోరెళ్లబెట్టుకుంటుంటారు. ఎందుకంటే.. అలాంటి దృశ్యాలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. అయితే.. అలాంటి దృశ్యాలల్లో ఈ వీడియో కూడా చేరింది. ఒక ఫ్రెంచ్ వ్యక్తికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది, ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఫ్రెంచ్ వ్యక్తి వంతెన వంపుపై సైకిల్ తొక్కడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ 18 సెకన్ల ఈ వీడియో మీరు చూసి కూడా ఎలా సాధ్యమైందంటూ నోరెళ్లబెట్టడం ఖాయం. ఈ వీడియోలో సైకిల్ తొక్కుతున్న వ్యక్తి వంతెన రెయిలింగ్ పై నుంచి కిందకు పడిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ.. ఆ వ్యక్తి నిలకడగా.. ఏదో మాయ చేసేలా సైకిల్ నడపడం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక బాలుడు సైకిల్ తీసుకొని వంతెనపైకి వెళ్లాడు. దానిపై సైకిల్‌తో ప్రమాదకరమైన స్టంట్‌ను చేసి చూపించాడు. ఈ వీడియో చూసిన తరువాత సైకిల్ తొక్కుతున్న వ్యక్తికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని అర్ధమవుతుంది. అసలు ఈ వీడియో చూస్తుంటేనే భయం అనిపిస్తోంది.. కానీ సైకిల్ తొక్కే వ్యక్తి ఎలా స్టంట్ చేశాడోనని ముక్కున వేలేసుకోవడం ఖాయం. అయితే.. ఈ వీడియోను అందరూ షేర్ చేయడంతోపాటు.. పలు కామెంట్లు కూడా రాస్తున్నారు. ఈ వీడియోను మొదట ఫ్రెంచ్ అథ్లెట్ ఆంటోయిన్ విలోని పంచుకున్నాడు. ఆ తర్వాత హాస్యనటుడు ట్రెవర్ నోహ్ కూడా షేర్ చేసి అద్భుతం అంటూ కామెంట్లు చేశారు. ఇది పోస్ట్ చేసిననాటినుంచి 1 లక్ష మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

వైరల్ వీడియో..

Also Read:

ఎండాకాలంలో జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా ? అయితే ఈ సులభమైన టిప్స్ ఫాలో అవ్వండి..

కరోనా కాలంలో ఇంట్లో ఉండే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే రిజల్ట్ పక్కా..