ఏపీ విద్యార్థుల‌కు జ‌గన్ స‌ర్కార్ గుడ్ న్యూస్.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్​

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.ఈ మేరకు....

ఏపీ విద్యార్థుల‌కు జ‌గన్ స‌ర్కార్ గుడ్ న్యూస్..  రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్​
ap-schools
Follow us

|

Updated on: May 06, 2021 | 8:44 AM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 2024-25 సంవ‌త్స‌రంలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్.. సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఇంగ్లీషు మీడియంలో ఈ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తామ‌ని విద్యాశాఖ తెలిపింది. మూడు, అయిదు, ఎనిమిది తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయ‌త్త‌మ‌వుతుంది. రాష్ట్రంలోని 73శాతం పాఠశాలలను ప్రభుత్వమే నడుపుతోందని.. ఈ రెండేళ్లలో 6,13,000 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరార‌ని విద్యాశాఖ‌ తెలిపింది.. ఇందులో నాలుగు లక్షల మంది ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన వారే ఉండ‌టం గ‌మ‌నార్హం. సీబీఎస్‌ఈలో దేశంలోని విద్యా సంస్థలతో పాటు 26 దేశాల్లోని 25 వేలకు పైగా పాఠశాలలు అనుబంధంగా ఉన్నాయి అని విద్యాశాఖ‌ పేర్కొంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రవేశపెడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 44,639 పాఠశాలలను దశల వారీగా ఈ బోర్డుకు అనుసంధానిస్తామని వెల్లడించింది.

Also Read: ఈ రాశివారికి ఈ రోజు వివాదాలు తలెత్త అవకాశాలు ఎక్కువ.. శుభ ఫలితాలు పొందేందుకు ఏం చేయాలి

ఏపీలో బ్యాంకర్ల సంచలన నిర్ణయం..ఈ రోజు నుంచి బ్యాంకుల సమయాల్లో మార్పులు..!