క‌రోనా తగ్గ‌డానికి క‌రిగించిన వెండి తాగి మాతాజీ మృతి.. ఆమె డెడ్ బాడీని శిష్యులు ఏం చేశారంటే

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను కుదిపేస్తుంది.. సో అపోహలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఓ మాతాజి కరిగించిన వెండిని తాగితే కరోనా సోకదంటూ... తాగి మరణించింది.

క‌రోనా తగ్గ‌డానికి క‌రిగించిన వెండి తాగి మాతాజీ మృతి.. ఆమె డెడ్ బాడీని శిష్యులు ఏం చేశారంటే
Mummified Body

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను కుదిపేస్తుంది.. సో అపోహలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఓ మాతాజి కరిగించిన వెండిని తాగితే కరోనా సోకదంటూ… తాగి మరణించింది. ఈ ఘటన వాషింగ్టన్ కొలరాడోలో చోటు చేసుకుంది.. ఇక ఆమె మృతదేహాన్ని శిష్యులు ఏం చేశారో తెలిస్తే..మరింత షాక్‌ అవుతారు. కొలరాడో ప్రాంతానికి చెందిన అమి కార్లసన్ అనే మహిళ లవ్ హాస్ ఓన్ అనే ఆధ్యాత్మిక సంస్థను నడుపుతోంది. శిష్యులంతా ఆమెను మదర్‌ ఆఫ్‌ గాడ్‌ అని పిలుస్తారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఆమె చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కార్లసన్ ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ కనిపించిన వింత దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. మూఢభక్తిలో మునిగిన ఆమె శిష్యులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఓ బట్టలో చుట్టి.. చుట్టూ లైట్స్ తో డెకరేట్‌ చేశారు. ఆమె గురించి భజనలు, పాటలు పాడుతూ పూజలు చేస్తూ కూర్చుని కనిపించారు. అది గమనించిన పోలీసులు వెంటనే వారందరినీ అదుపులోకి తీసుకుని కార్లసన్ మృతదేమాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఇకపోతే, పోస్ట్ మార్టంలో మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి.

కార్లసన్ ఈ యేడాది మార్చిలోనే చనిపోయిందని పోస్ట్ మార్టం చేసిన వైద్యులు తెలిపారు. అంతేకాదు ఆమె ద్రవరూపంలో ఉన్న వెండిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల చనిపోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:  తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు అత్యధికం ఈ జిల్లాలోనే… పూర్తి వివ‌రాలు

 ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కరోనా పాజిటివ్‌.. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స