Corona Guidelines: కరోనా బాధితుల కోసం.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. వివరాలివే..
Corona Guidelines Update: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా...
Corona Guidelines Update: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని కోవిడ్ బాధితులు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. స్వల్ప లక్షణాలు ఉన్నవారు, లక్షణాలు లేకున్నా ఇంట్లోనే ఉండాలని సూచించింది. కరోనా సోకినవారు మూడు పొరల మాస్కు ధరించాలని.. వీలైనంత ఎక్కువగా నీరు, జ్యూస్ లు తాగాలని పేర్కొంది.
అలాగే బీపీ, షుగర్ ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలని తెలిపింది. ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలంది. హోం ఐసోలేషన్ నుంచి పది రోజుల తర్వాత బయటికి రావాలని పేర్కొంది. ఇక చివరి మూడు రోజులు జ్వరం రాకపోతే కరోనా టెస్టు అవసరం లేదని స్పష్టం చేసింది.
లాక్ డౌన్ ఉన్నా టీకా పంపిణీ ఆగకూడదు…
దేశంలోని కరోనా పరిస్థితులపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై ఆరా తీసారు. టీకా పంపిణీలో వేగం పెంచాలని.. లాక్ డౌన్ ఉన్నా ప్రజలు వ్యాక్సిన్ పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రాలకు అన్ని విధాల సాయం చేస్తామన్నారు. ఇప్పటివరకు 17.7 కోట్ల టీకాలు సరఫరా చేశామని ప్రధాని మోదీ వెల్లడించారు.
ఇవి చదవండి:
ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..
Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!
ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?