AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MK Stalin Cabinet: తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!

తమిళనాడు పీఠంపై ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూర్చోబోతున్నారు. కాగా, ఇందుకు అనుగుణంగా తన మంత్రివర్గాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలను వెల్లడించారు.

MK Stalin Cabinet: తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!
Mk Stalin’s Cabinet Colleagues Revealed
Balaraju Goud
|

Updated on: May 06, 2021 | 6:39 PM

Share

MK Stalin Cabinet: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సూర్యోదయం.. పదేళ్ల నిరీక్షణ అనంతరం మళ్లీ డీఎంకేకు అధికారం కట్టబెట్టారు ద్రావిడ జనం. మొత్తం 234 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో 133 స్థానాలను డీఎంకే కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. గత నెల 6న జరిగిన ఎన్నకల్లో డీఎంకే తిరుగులేని అధిక్యత సంపాదించింది. పదేళ్ళపాటు డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్‌ కఠోర శ్రమకు దక్కిన ప్రతిఫలమని పార్టీ వేనోళ్ల కొనియాడుతోంది.

డీఎంకే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఇది ఆరోమారు. తొలిసారిగా 1967-71 మధ్య అధికారమెక్కిన డీఎంకే.. ఆ తరువాత 1971-76, 1989-91, 1996- 2001, 2006-2011 మధ్యకాలంలోనూ పాలన సాగించింది. తొలిసారిగా తమిళనాడు పీఠంపై ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూర్చోబోతున్నారు. కాగా, ఇందుకు అనుగుణంగా తన మంత్రివర్గాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. శాసన సభ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. బుధవారం ఆయన గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ మంత్రివర్గంలో దురైమురుగన్ నెంబర్-2 స్థానంలో కనిపిస్తున్నారు. మంత్రులుగా నియమితులు కాబోయేవారి పేర్లను స్టాలిన్ గవర్నర్ పురోహిత్‌కు సిఫారసు చేశారు. ఈ సిఫారసులను గవర్నర్ ఆమోదించినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది.

తమిళనాడులో మొత్తం 234 మంది ఎమ్మెల్యేలున్న శాసన సభలో డీఎంకే 133 స్థానాలను సాధించింది. డీఎంకే శాసన సభా పక్ష నేతగా స్టాలిన్‌ మంగళవారం ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయనతోపాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రుల వివరాలను గురువారం వెల్లడించారు. ముఖ్యమంత్రి మినహా 33 మందితో ఈ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.

ఎంకే. స్టాలిన్ ముఖ్యమంత్రి బాధ్యతలతోపాటు ప్రభుత్వ, సాధారణ పరిపాలన, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అఖిల భారత సర్వీసులు, జిల్లా రెవిన్యూ అధికారులు, పోలీసు, హోం, స్పెషల్ ఇనీషియేటివ్స్, స్పెషల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, దివ్యాంగుల సంక్షేమం శాఖలను నిర్వహిస్తారు.

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నవారు… 1. ఎంకే స్టాలిన్‌: ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన 2. దురైమురుగన్‌: జల వనరులు 3. కేఎన్‌ నెహ్రూ: పురపాలక కార్యకలాపాలు 4. ఐ. పెరియసామి: సహకార శాఖ 5. ఎన్‌. పొన్ముడి: ఉన్నత విద్య 6. ఈవీ వేలు: పబ్లిక్‌ వర్క్స్‌ 7. ఎంఆర్‌కే పన్నీరు సెల్వం: వ్యవసాయం, రైతు సంక్షేమం 8. కేకేఎస్‌ఆర్‌ రామచంద్రన్‌: రెవెన్యూ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ 9. తంగం థెన్నరసు: పరిశ్రమల శాఖ 10. ఎస్‌ రఘుపతి: న్యాయ శాఖ 11. ఎస్‌. ముత్తుసామి: గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి 12. కేఆర్‌ పెరియకరుప్పన్‌: గ్రామీణాభివృద్ధి శాఖ 13. టీఎం అంబారసన్‌: గ్రామీణ పరిశ్రమలు 14. ఎంపీ సామినాథన్‌: సమాచార, ప్రచార శాఖ 15. పి. గీతాజీవన్‌: సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత 16. అనిత ఆర్‌ రాధాకృష్ణన్‌: మృత్స్యకార, జంతు పరిరక్షణ 17. ఎస్‌ఆర్‌ రాజకన్నప్పన్‌: రవాణా శాఖ 18. కే రామచంద్రన్‌: అటవీ శాఖ 19. ఆర్‌ చక్రపాణి: ఆహార, పౌర సరఫరా 20: వీ. సెంథిల్‌ బాలాజీ: విద్యుత్‌, ప్రొబిషన్‌, ఎక్సైజ్‌ 21. ఆర్‌ గాంధీ: చేనేత, టెక్స్‌టైల్స్‌ శాఖ 22. ఎంఏ సుబ్రమణియన్‌: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం 23. పి. మూర్తి: వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్‌ 24. ఎస్‌ఎస్‌ శివశంకర్‌: బీసీ సంక్షేమం 25. పీకే శేఖర్‌బాబు: దేవాదాయ శాఖ 26. పళనివేల్‌ త్యాగరాజన్‌: ఆర్థిక, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ 27. ఎస్‌ఎమ్‌ నాజర్‌: పాలు, డెయిరీ డెవలప్‌మెంట్‌ 28. జిగ్నీ కేఎస్‌ మ​స్తాన్‌: మైనారిటీ, ఎన్నారై సంక్షేమం 29. అన్బిల్‌ మహేశ్‌ పొయ్యమొళి: పాఠశాల విద్య 30. శివ వీ మెయ్యనాథన్‌: పర్యావరణ శాఖ 31. సీవీ గణేశన్‌: కార్మిక సంక్షేమం, నైపుణ్య శిక్షణ 32. టి మనో తంగరాజా: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 33. ఎం మతివెంతన్‌: పర్యాటక శాఖ 34. ఎన్‌కే సెల్వరాజ్‌: ఆది ద్రవిడ సంక్షేమం

Follow Us