Farmers Protest: ఘాజీపూర్ బోర్డర్‌లో రైతులను కలవనున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్..
శివసేన నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను కలవనున్నారు. శివసేన పార్టీ అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే...
Farmers Protest – Shiv Sena: శివసేన నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను కలవనున్నారు. శివసేన పార్టీ అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూచనల మేరకు ఢిల్లీ సమీపంలో ఘాజీపూర్ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులను కలవనున్నట్లు సంజయ్ రౌత్ ట్విట్ చేశారు. రైతుల ఆందోళనకు శివసేన మొదటినుంచి మద్దతు ఇస్తోందని.. రైతుల ప్రయోజనాల కోసం మహా వికాస్ అఘాఢి ప్రభుత్వం పలు నిర్ణయాలు కూడా తీసుకుందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. సీఎం సూచనల మేరకు రైతుల ఘాజీపూర్ బోర్డర్‌ను సందర్శించనున్నానని.. కిసాన్ ఆందోళన్ జిందాబాద్ అంటూ రౌత్ ట్విట్ చేశారు.
దీనిలో భాగంగా మరికాసేపట్లో సంజయ్ రౌత్ మరికాసేపట్లో ఘాజీపూర్ బోర్డర్‌కు చేరుకోనున్నారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 60 రోజులకుపైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం నాటి నుంచి ఢిల్లీలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల మేరకు భారీగా భద్రతను పెంచారు. సరిహద్దుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి సాయుధ దళాలను మోహరించారు.
Also Read:
ఢిల్లీ పోలీసులకు మెటల్ రాడ్స్ ! అంతా వట్టిదే ! అలాంటి ప్రతిపాదన లేదన్న అధికారులు