రైతులను అడ్డగించేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేస్తారా ? ముందు బ్రిడ్జీలు కట్టండి, గోడలను కాదు..రాహుల్ గాంధీ

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను అడ్డగించేందుకు ఢిల్లీ లోని సరిహద్దు ప్రాంతాలవద్ద ఇనుప వైర్లతో చుట్టిన కంచెలవంటివి ఏర్పాటు చేయడాన్ని...

రైతులను అడ్డగించేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేస్తారా ? ముందు బ్రిడ్జీలు కట్టండి, గోడలను కాదు..రాహుల్ గాంధీ
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 02, 2021 | 1:18 PM

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను అడ్డగించేందుకు ఢిల్లీ లోని సరిహద్దు ప్రాంతాలవద్ద ఇనుప వైర్లతో చుట్టిన కంచెలవంటివి ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పు పట్టారు.  తాజాగా నాలుగు లేయర్లతో ఇలాంటి బ్యారికేడ్లను,  ఇనుప కంచెలను పోలీసులు ఏర్పాటు చేసి…. నగరాన్ని దుర్భేద్యమైన ‘కోట’ గా  మార్చేశారు. యూపీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలనుంచి మళ్ళీ పెద్ద సంఖ్యలో అన్నదాతలు ఢిల్లీ సింఘు బోర్డర్ వద్దకు చేరుకోవడానికి బయలుదేరుతున్నారు. ఘాజీపూర్-మీరట్ హైవే ద్వారా ఇక్కడికి వస్తున్నారు. వీరిని సింఘు చేరడానికి ముందే అడ్డుకోవడానికి తాత్కాలికంగా గోడలను కూడా పోలీసులు నిర్మిస్తున్నారు.ఢిల్లీ-హర్యానా హైవేపై చాలాభాగం ఈ విధమైన ‘కృత్రిమ గోడలతో’ నిండిపోయింది. ఈ ప్రాంతంలో పోలీసుల బలగాలను కూడా విపరీతంగా పెంచారు.

ఈ ఫోటోలను ట్వీట్ చేసిన రాహుల్.. మొదట వంతెనలను కట్టాలని, గోడలను కాదని అన్నారు. వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు ఎన్ని అడ్డంకులు వఛ్చినా రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తారని ఆయన పేర్కొన్నారు.పలు ఆంక్షలు విధించడానికి సమాయత్తమయ్యారు.  అన్నదాతలను కొడుతున్నారని, వేధిస్తున్నారని, వారిపట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఇటీవల మోదీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇక ఈ నెల 6 న అన్నదాతలు దేశవ్యాప్తంగా చక్కా జామ్ ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో హస్తినను  పోలీసుల కోటగా మారుస్తున్నారు.

Read More:రైతులను అడ్డగించేందుకు హర్యానా పోలీసుల ‘వినూత్న ప్రయోగం’, రోడ్లు, కందకాలే తవ్వేశారు.