2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ఏపీకి అందించిన సహాయం వివరాలు వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి
బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర..
బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏపీ రాష్ట్రానికి ఎంత సహాయం ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
1. కోవిడ్ ఆత్యవసర పరిస్థితులలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సహయం రూ. 351 కోట్లు
2. జాతీయ హెల్త్ మిషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి అందిన సహాయం రూ. 523 కోట్లు
3. విపత్తు నిర్వహణ నిధి కింద రాష్ట్రానికి అందిన సహాయం రూ. 449 కోట్లు
4. రాష్ట్రానికి మూలధన వ్యయం కోసం అందిన సహాయం రూ. 179 కోట్లు
5. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి సహాయం
6. కేంద్రం నుంచి 2020 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్రానికి ఆహారధాన్యాలు చేసిన సహాయం 7,24,662 మెట్రిక్ టన్నులు, కోటి ఎనబై లక్షల మంది లబ్దిదారులు.
7. కేంద్రం నుంచి 2020 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పప్పు దినుసులు 52,68,030 మంది లబ్దిదారులకు 15,804 మెట్రిక్ టన్నులు.
8. ప్రధాన మంత్రి ఉజ్వల కార్యక్రమం ద్వారా కేంద్రం నుంచి 18,74,717 లబ్దిదారులకు రూ. 130 కోట్లు.
9. ఎమర్జెన్సి క్రెడిట్ లైన గ్యారెంటీ స్కీమ్ ద్వారా కేందం నుంచి రాష్ట్రానికి 1,30,127 లబ్దిదారులకు రూ. 8,682 కోట్లు సహాయం.
10. లాక్ డౌన్ సందర్బంగా వలస కూలీలకు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన పప్పుదినుసుల సహాయం 35,991 లబ్దిదారులకు 180 కోట్ల మెట్రిక్ టన్నులు.
11. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రాష్ట్రం నుంచి 33,31,468 మంది లబ్దిదారుల సహాయం.
12. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కార్యక్రమం ద్వారా 52,60,800 మంది లబ్దిదారులు.
13. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రీబ్యూషన్ ద్వారా 1,78,225 లబ్దిదారులకు రూ. 102.3 కోట్ల సహాయం.
14. నేషనల్ సోషల్ అసిస్టెంట్ కార్యక్రమం ద్వారా 6,65,956 మంది లబ్దిదారులు
15. భవన నిర్మాణ కార్మికుల కోసం కేంద్రం అందించిన సహాయం 8,30,324 మంది లబ్దిదారుకలు రూ. 124 కోట్లు సహాయం.
Also Read: TDP Atchannaidu: “మా పార్టీ అధికారంలోకి వస్తే నేనే హోం మినిస్టర్.. అప్పుడు అందరి అంతు తేలుస్తా”