Breaking: టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధింపు..
సర్పంచ్ అభ్యర్థిని బెదిరించాడన్న ఆరోపణలతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో శ్రీకాకుళం కోర్టు...
Atchannaidu 14 Days Remand: టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు శ్రీకాకుళం స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా బెదిరించారన్న కేసులో అచ్చెన్నాయుడును ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ని అరెస్ట్ చేసిన అనంతరం కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా అచ్చెన్నాయుడు రెస్టుతో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పంచాయతీ ఎన్నికల పోరు తారా స్థాయికి చేరేలా కనిపిస్తోంది.
అసలేం జరిగిందంటే.?
నిమ్మాడ నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భార్య సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెపై పోటీకి వైసీపీ నుంచి అచ్చెన్నాయుడుకు వరసకు అన్న కొడుకైన కింజారపు అప్పన్న బరిలోకి దిగారు. అప్పన్నతో నామినేషన్ వేయించడానికి టెక్కలి వైసీపీ కోఆర్డినేటర్ దువ్వాడ శ్రీను వెళ్లారు. వీళ్లిద్దర్ని అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ అడ్డుకున్నారు.
Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..