ఢిల్లీ పోలీసులకు మెటల్ రాడ్స్ ! అంతా వట్టిదే ! అలాంటి ప్రతిపాదన లేదన్న అధికారులు
ఆందోళనకారులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ పోలీసులకు మెటల్ రాడ్లను సమకూర్చాలన్న ప్రతిపాదన వట్టిదేనని తేలిపోయింది. జనవరి 26 న ఎర్రకోట వద్ద...
ఆందోళనకారులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ పోలీసులకు మెటల్ రాడ్లను సమకూర్చాలన్న ప్రతిపాదన వట్టిదేనని తేలిపోయింది. జనవరి 26 న ఎర్రకోట వద్ద ఘర్షణల సందర్భంగా ఓ రైతు ఓ పోలీసు అధికారిపైకి పొడవాటి కత్తి తో దాడి చేసిన ఘటన తాలూకు ఫోటోలు వైరల్ అయ్యాయి. దాంతో ఇక ఇలాంటి హింసాత్మక ఘటనల్లో నిరసనకారులను ఎదుర్కొనేందుకు పోలీసులకు పొడవాటి స్టీల్ రాడ్స్ ను సమకూరుస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విధమైన ఉత్తర్వులను తాము జారీ చేయలేదని పోలీసు అధికారులు తెలిపారు. మెటల్ రాడ్స్ పట్టుకున్న పోలీసుల తాలూకు ఫోటోల వెనక ఎవరున్నారో తెలుసుకుంటున్నామని వారు చెప్పారు. ఈ ఖాకీలు నగరంలోని షాహదర పోలీసు యూనిట్ కి చెందినవారిగా గుర్తించామని, అక్కడి ఓ అధికారి ఈ లోహపు ఆయుధాలను వీరికి సమకూర్చాలని ఆదేశించినట్టు వెల్లడైందని వారన్నారు. ఇందుకు ఆ ఆఫీసర్ నుంచి సంజాయిషీ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.
ఈ స్టీల్ లాఠీలను వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఎవరి ఆదేశాలతో ఆ అధికారి ఈ సూచన చేశారో ఇన్వెస్టిగేషన్ కూడా మొదలైంది.
Read More: కారులో రూ.80 లక్షలు లభ్యం.. నివ్వెర పోయిన పోలీసులు, అధికారులు.. రంగంలోకి ఆదాయపన్ను శాఖ అధికారులు.