Corona Cases: దేశంలో ఆ రెండు రాష్ట్రాల్లో తగ్గని కరోనా కేసులు.. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు

Corona Cases: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా తగ్గుముఖం పట్టగా, మరి కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు..

Corona Cases: దేశంలో ఆ రెండు రాష్ట్రాల్లో తగ్గని కరోనా కేసులు.. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు
Maharashtra COVID-19 cases
Follow us
Subhash Goud

|

Updated on: Feb 02, 2021 | 12:51 PM

Corona Cases: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా తగ్గుముఖం పట్టగా, మరి కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదువుతున్నాయి. ఇక మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఈ రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రాష్ట్రాలకు ఉన్నత స్థాయి బృందాలను పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. కోవిడ్‌ వ్యాప్తి అరికట్టేందుకు మహారాష్ట్ర, కేరళ రాష్ట్ర అధికారులకు సహకారం అందించేందుకు రెండు ఉన్నత స్థాయి బృందాలను పంపించనున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం, ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి చెందిన నిపుణుల బృందం మహారాష్ట్రకు, ఆరోగ్యశాఖలోని సీనియర్‌ అధికారులు, నిపుణులతో కూడిన మరో బృందం త్వరలోనే కేరళకు పంపించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖలతో కలిసి పని చేస్తాయని, క్షేత్ర స్థాయిలో పరిశీలించి పలు సిఫార్సులు చేస్తుందని పేర్కొంది.

కాగా, దేశ వ్యాప్తంగా కోవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య భారీగానే ఉంది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల్లో దాదాపు 70 శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.

World Covid 19 updates: ప్రపంచవ్యాప్తంగా క్రమంగా తగ్గుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే…