Republic Day: రిపబ్లిక్ డే పరేడ్‌లో కవాతుకు ‘దిశా’ నాయకత్వం.. ‘నారీ శక్తి’ ఇతివృత్తంగా ప్రదర్శన
భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించే పరేడ్ లో నౌకాదళ కవాతు బృందానికి మహిళా ఆఫీసర్ దిశా అమృత్ నాయకత్వం వహించనున్నారు. కర్తవ్య పథంలో జరిగే ఈ కవాతులో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు, అగ్నివీరులు కూడా పాల్గొంటారని నేవీ తెలిపింది. నారీ శక్తి'ని ప్రధాన ఇతివృత్తంగా రిపబ్లిక్ పరేడ్ లో ప్రదర్శన ఇవ్వనున్నారు.

కలలు కనండి.. ఆ కలలను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు చేయండి అని యువతకు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం దిశా నిర్ధేశం చేశారు. అయితే కొందరు మాత్రమే తాము కన్న కలలను ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వేరకుండా ప్రయత్నాలు చేస్తారు. తాము కన్న కలలు నెరవేర్చుకుంటారు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు నేవీకి చెందిన 29 ఏళ్ల మహిళా అధికారిణి దిశా అమృత్. జనవరి 26వ తేదీన రాజ్‌పథ్‌లో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనాలని కలలు కన్నారు.. ఇప్పుడు ఆ కల నెరవేరనుంది. అవును నేవీ మహిళా అధికారిణి దిశా అమృత్ కు అరుదైన గౌరవం దక్కింది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించే పరేడ్ లో నౌకాదళ కవాతు బృందానికి మహిళా ఆఫీసర్ దిశా అమృత్ నాయకత్వం వహించనున్నారు. వచ్చే వారం, జనవరి 26న కర్తవ్య పథంలో జరిగే ఈ కవాతులో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు, అగ్నివీరులు కూడా పాల్గొంటారని నేవీ తెలిపింది. నారీ శక్తి’ని ప్రధాన ఇతివృత్తంగా రిపబ్లిక్ పరేడ్ లో ప్రదర్శన ఇవ్వనున్నారు.
మంగళూరుకు చెందిన దిశా అమృత్ 2016లో నేవీలో అడుగు పెట్టారు. రిపబ్లిక్ డే వేడుకల్లో 144 మంది యువ నావికుల బృందానికి నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ సీడీఆర్ అమృత్ నాయకత్వం వహించనున్నారు. ఈ బృందంలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ‘అగ్నివీర్స్’గా శిక్షణ పొందుతున్నారు. మరో మహిళా అధికారి సబ్ లెఫ్టినెంట్ వల్లి మీనా ఎస్ ముగ్గురు ప్లాటూన్ కమాండర్లలో ఒకరు.
తనకు వచ్చిన ఈ అవకాశంపై దిశా స్పందిస్తూ.. తాను మగవారితో మహిళలు సమానం అని నిరూపించానని.. తనను “మహిళా అధికారి”గా కాకుండా “ఆఫీసర్”గా పిలవాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నావికా పరేడ్ బృందానికి నాయకత్వం వహించడం తన జీవితంలో అందిన అద్భుతమైన అవకాశం” అని ఆమె అన్నారు




దిశా అమృత్ కర్ణాటక లోని బీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచ్ లర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివారు. ఆమెకు ఇప్పుడు 29 ఏళ్లు. 2008లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ రిపబ్లిక్ టీమ్ లో భాగం కావాలనే కలలను కన్నట్లు చెప్పారు. 2017లో శిక్షణ పూర్తి చేసుకుని అండమాన్ నికోబార్ దీవుల్లోని కీలక నౌకాదళ కేంద్రంలో నియమితులయ్యారు. మా నాన్న కూడా సాయుధ దళాల్లో చేరాలని అనుకున్నారు కానీ కుదరలేదు. నేను నేవీలో భాగమైనందుకు గర్విస్తున్నాను.. ఉత్సాహంతో, అంకితభావంతో సేవను కొనసాగిస్తానని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
