Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Marriage: ప్రాచీన సంస్కృతిని చాటిచెప్పేలా గోమాత సాక్షిగా వివాహం.. గోవు సంరక్షణ కోసమే అంటున్న వధూవరులు

నూతన వధూవరులు తమకు గోమాత పై ఉన్న ప్రేమని ఓ అడుగు ముందుకు వేసి.. మరింత భిన్నంగా ప్రకటించారు. అవును  మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఓ అపూర్వ వివాహం జరిగింది.  నూతన వధూవరులు గోమాతను తమ పెళ్ళికి సాక్షిగా భావించి ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్నారు.

Unique Marriage: ప్రాచీన సంస్కృతిని చాటిచెప్పేలా గోమాత సాక్షిగా వివాహం.. గోవు సంరక్షణ కోసమే అంటున్న వధూవరులు
Unique Marriage In Mp
Follow us
Surya Kala

|

Updated on: Jan 21, 2023 | 3:36 PM

హిందూ సనాతన ధర్మంలో ఆవుకు ప్రత్యేక స్థానం ఉంది. గోమాతగా పూజిస్తారు. . సమస్త దేవతా దేవుళ్ళు అందరూ గోవులో కొలువై ఉంటారని.. గృహ ప్రవేశం వంటి శుభకార్యాల్లో గోవుని తమ ఇంటిలోకి మొదట అడుగు పెట్టే అవకాశం ఇస్తారు. అయితే ఇప్పుడు ఓ నూతన వధూవరులు తమకు గోమాత పై ఉన్న ప్రేమని ఓ అడుగు ముందుకు వేసి.. మరింత భిన్నంగా ప్రకటించారు. అవును  మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఓ అపూర్వ వివాహం జరిగింది.  నూతన వధూవరులు గోమాతను తమ పెళ్ళికి సాక్షిగా భావించి ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్నారు. వేదమంత్రాలతో హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహం అత్యంత ఘనంగా జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

గ్వాలియర్ జిల్లాలోని  DRP లైన్‌లో నివసిస్తున్న రంజన శర్మ వివాహం ఆగ్రా నివాసి యతేంద్ర శర్మతో నిశ్చయమైంది. పెళ్లి కూతురు రంజన శర్మ కుటుంబీకులు ఈ పెళ్లి ఆవు సన్నిధిలో జరగాలని ఆకాంక్షించారు. ఇదే విషయాన్ని వరుడి తరఫు వారికి తెలిపారు.  అమ్మాయి తరపు మాటలకు వరుడి తరపు వారు కూడా అంగీకరించారు. అనంతరం రంగ్ మహల్ మ్యారేజ్ గార్డెన్‌లో వివాహ వేడుక జరిగింది. ఈ సందర్భంగా లాల్‌ తిపర గౌశాల మహంత్‌ రిషబ్‌ దేవానంద్‌ మహరాజ్‌, పలువురు సాధువులు వివాహాన్ని వీక్షించి వధూవరులను ఆశీర్వదించారు.

గోసంరక్షణ ప్రచారంపై సమాజానికి అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రంజన సోదరుడు అభిషేక్ శర్మ తెలిపారు. ముందుగా సాధువుల సమక్షంలో వధూవరులు గోవుకు పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు ఈ జంట.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత కాలంలో వివాహ వేడుక భారతీయ సంస్కృతిని వదిలి పాశ్చాత్య సంగీతం, సంస్కృతి వైపు వెళ్తున్నామని.. వివాహ వేడుకలో అసభ్యకరమైన మాటలు, డబ్బు వృధా చేసే సంఘటనలున్నాయని చెప్పారు. ఈ వివాహ కార్యక్రమం సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ. అత్యంత సింపుల్‌గా జరిగింది.

ఈ పెళ్లి ఇది మన ప్రాచీన సంస్కృతిని చాటిచెప్పే విశిష్టమైన వివాహమని అన్నారు. ప్రధాన ద్వారం వద్ద గోమాతకు పూజలు చేశారు. అతిథులకు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. వేదికపై సాధువులందరూ ఉన్నారు. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన అతిథులకు మంచి వెరైటీ సాత్విక భోజనాన్ని వడ్డించారు. ఇలాంటి వివాహాలు నిర్వహించడం ద్వారా గోవు సంరక్షణ, ప్రచారం కోసం ప్రజలను ప్రోత్సహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..