సిద్ధూ కోసం ‘లాబీయింగ్’ చేసిన ఇమ్రాన్ ఖాన్.. మాజీ సీఎం అమరీందర్ సంచలన వ్యాఖ్యలు

Punjab Elections 2022: ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మరింత వేడెక్కింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు‌పై ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్( సంచలన వ్యాఖ్యలు చేశారు.

సిద్ధూ కోసం ‘లాబీయింగ్’ చేసిన ఇమ్రాన్ ఖాన్.. మాజీ సీఎం అమరీందర్ సంచలన వ్యాఖ్యలు
Amarinder Singh
Follow us
Janardhan Veluru

|

Updated on: Jan 24, 2022 | 7:17 PM

Punjab Elections 2022: ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మరింత వేడెక్కింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు‌(Navjot Sidhu)పై ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్(Captain Amarinder Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూను తన కేబినెట్‌లోకి తిరిగి తీసుకోవాలని సిఫార్సు చేస్తూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Pakistan PM Imran Khan) తరఫు నుంచి తనకు ఓ సందేశం వచ్చినట్లు సంచలన ప్రకటన చేశారు. ఆ మేరకు సోమవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో అమరీందర్ సింగ్ సంచలన విషయాలు వెల్లడించారు. సిద్ధూను కేబినెట్‌లోకి తీసుకోవాలని తాను కోరుతున్నట్లు తనకు పంపిన ఆ సందేశంలో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నట్లు వెల్లడించారు. సిద్ధూ తనకు చిరకాల మిత్రుడని ఇమ్రాన్ ఖాన్ ఆ సందేశంలో పేర్కొన్నారని తెలిపారు. మంత్రి పదవిని సక్రమంగా నిర్వహించడంలో సిద్ధూ విఫలం చెందితే.. ఆయన్ను కేబినెట్ నుంచి తీసేయొచ్చని తన సందేశంలో ఇమ్రాన్ సూచించినట్లు తెలిపారు. అయితే సిద్ధూను తన కేబినెట్‌లోకి మళ్లీ తీసుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాబీయింగ్ చేసినట్లు నిరూపించే ఆధారాలేవీ కెప్టెన్ అమరీందర్ సింగ్ మీడియాకు ఇవ్వలేదు.

గతంలో అమరీందర్ సింగ్ కేబినెట్‌లో సిద్ధూ టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన శాఖను మార్చడంతో అసంతృప్తి చెందిన సిద్ధూ.. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి అమరీందర్ సింగ్ ప్రభుత్వ పనితీరుపై బహిరంగ విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య మాటల యుద్ధం నిత్యం కొనసాగేది.

సిద్ధూ వర్గం ఎమ్మెల్యేలతో నెలకొన్న విభేదాల కారణంగా ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించడం తెలిసిందే. మరో గత్యంతరం లేక అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో చన్నీని సీఎంగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్(PLC) పేరిట కొత్త పార్టీ పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని అమరీందర్ సింగ్ పార్టీ ఎన్నికల బరిలో నిలుస్తోంది.

ముగిసిన సీట్ల సర్దుబాటు..

పొత్తులో భాగంగా మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 35 స్థానాల్లో పంజాబ్ లోక్ కాంగ్రెస్(PLC), బీజేపీ 65 స్థానాల్లో పోటీ చేయనుంది. సుఖ్‌దేవ్ సింగ్ దిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ చీలికవర్గం 15 సీట్లు కేటాయించారు. ఆ మేరకు కెప్టెన్ అమరీందర్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అధికారిక ప్రకటన చేశారు. తమ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో సుస్థిర పాలన, భద్రతకు కృషి చేస్తుందని జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకపోయిందని, అధికారంలోకి వస్తే మళ్లీ పంజాబ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్డీయే కూటమి పనిచేస్తుందన్నారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఫిబ్రవరి 20న జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Also Read..

TIMS Recruitment 2022: టిమ్స్ గచ్చిబౌలిలో 113 టీచింగ్ ఫ్యాకల్టీ జాబ్స్.. రూ.1,50,000 జీతం.. పూర్తి వివరాలు..

Dragon Fruit: ఈ 3 వ్యాధులను దూరం చేసే దివ్య ఔషధం.. తింటే తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!