Dragon Fruit: ఈ 3 వ్యాధులను దూరం చేసే దివ్య ఔషధం.. తింటే తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

Health Tips: ప్రతీ రోజూ ఓ పండు(Fruits) తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు అంటుంటారు. పండ్లు తినడం వల్ల శరీరానికి అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి.

Dragon Fruit: ఈ 3 వ్యాధులను దూరం చేసే దివ్య ఔషధం.. తింటే తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
Dragon Fruit
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 24, 2022 | 7:24 PM

మానసిక ఒత్తిళ్లు, ఆర్ధిక ఇబ్బందులు, పని ఒత్తిడి.. ఇలా వివిధ కారణాల వల్ల ఈ మధ్యకాలంలో మనిషి తరచూ అనారోగ్యం బారిన పడుతున్నాడు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’(Health Is Wealth) అని పెద్దలు అంటుంటారు. ఎలప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రకాల పండ్లు తినాలి. ప్రతీ రోజూ ఓ పండు(Fruits) తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు అంటుంటారు. పండ్లు తినడం వల్ల శరీరానికి అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ఇక అవన్నీ దొరికే సూపర్ ఫ్రూట్.. ‘డ్రాగన్ ఫ్రూట్’. డ్రాగన్ ఫ్రూట్ (Dragon Fruit) గులాబీ రంగులో ఉంటుంది. లోపల తెల్లటి గుజ్జు.. అందులో నల్లటి విత్తనాలు ఉంటాయి.

ఈ డ్రాగన్ ఫలంలో కేలరీలు తక్కువగా, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థం కూడా అధికంగానే ఉంటుంది. ఐరన్, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ తదితర విలువైన పోషకాలు లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు కొంచెం ఎక్కువే అయినా దానికి తగ్గట్లే శరీరానికి శక్తినిచ్చే న్యూట్రియెంట్స్ లభిస్తాయి. అందుకే ఈ పండు తినడం ఎంతో మేలు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను, క్యాన్సర్‌ను, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయి. డ్రాగన్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు దూరం చేస్తాయని చెబుతుంటారు. అలాగే షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం..

డ్రాగన్ ఫ్రూట్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..

> డయాబెటిక్ పేషెంట్స్‌కు ఇది దివ్యఔషధం

> క్యాన్సర్‌ను నివారిస్తుంది.

> రోగనిరోధక శక్తిని పెంచుతుంది

> జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

> గుండె జబ్బులను నయం చేస్తుంది

> చర్మ సమస్యలను దూరం చేస్తుంది

> నల్లగా, మృదువుగా జుట్టు మెరిసేలా చేస్తుంది

> ఎముకలను కాల్షియం అందిస్తుంది

> కళ్లకు మంచిది

> గర్భిణీలకు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంతో ఉపయోగకరం

మరోవైపు ఏదైనా కూడా మితంగా తినమని అంటారు వైద్యులు. ఏదీ కూడా అతిగా తినకూడదు. ఒకవేళ తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. డ్రాగన్ ఫ్రూట్ విషయంలోనూ అంతే..! డ్రాగన్ ఫ్రూట్ అధికంగా తింటే కడుపు సంబంధిత సమస్యలు, ఎర్రటి రంగులో మూత్ర విసర్జన కావడం, అలెర్జీ లాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?