AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: దీర్ఘకాలిక కొవిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే ఈ సూపర్ ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాల్సిందే..

దేశంలో కరోనా మరోసారి కల్లోలం సృష్టిస్తోంది.  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో వేగంగా విస్తరిస్తోంది. అయితే గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కంటే లక్షణాలు, తీవ్రత తక్కువగా ఉన్నా..

Coronavirus: దీర్ఘకాలిక కొవిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే ఈ సూపర్ ఫుడ్స్  తప్పకుండా తీసుకోవాల్సిందే..
Coronavirus
Basha Shek
|

Updated on: Jan 24, 2022 | 9:34 PM

Share

దేశంలో కరోనా మరోసారి కల్లోలం సృష్టిస్తోంది.  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో వేగంగా విస్తరిస్తోంది. అయితే గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కంటే లక్షణాలు, తీవ్రత తక్కువగా ఉన్నా.. ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లాంగ్ కొవిడ్ సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంటే కొవిడ్ నెగెటివ్ వచ్చినా.. చాలా రోజుల వరకు వాసన, రుచి  తెలియకపోవడం, కోరింత దగ్గు, బలహీనత,  కీళ్లలో నొప్పి తదితర అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి.  ముఖ్యంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు చాలా రోజుల పాటు పట్టి  పీడిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.  ఈక్రమంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి జీవనశైలిని మార్చుకోవాలని, ముఖ్యంగా పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

కొంబుచా టీ..

గ్రీన్ టీ, బ్లాక్ టీల మాదిరిగానే  ఇది కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటకు పంపుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. పైగా దీనిని పెరుగులాగే పులియబెట్టి తయారుచేస్తారు కాబట్టి  గట్ హెల్త్ కు  ఎంతోమంచిదని వైద్య నిపుణులు చెబుతారు.

కేఫిర్..

శరీరంలో  రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే జీర్ణక్రియ రేటు సక్రమంగా ఉండాలి. ముఖ్యంగా పోషకాహారం బలంగా తీసుకోవాలి. అదేవిధంగా శరీరంలోని ట్యాక్సిన్లు ఎప్పటికప్పుడు బయటకు వెళుతూ ఉండాలి. ఈవిషయంలో ఫిర్ లాంటి  పులియబెట్టిన ఆహారాలు, పానీయాలు సమర్థంగా పనిచేస్తాయి.  వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  ఇందులోని బ్యాక్టీరియా, ఈస్ట్ వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

సౌర్‌క్రాట్‌

మెత్తగా కత్తిరించిన పచ్చి క్యాబేజీ ముక్కలను  లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ద్వారా పులియబెట్టి సౌర్ క్రాట్ ను తయారుచేస్తారు.  లాక్టిక్ యాసిడ్ ఉన్నందున దీనిని పెద్ద మొత్తంలో తయారుచేసి ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. దీనిని డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా జీర్ణక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది.

కిమ్చి లేదా  స్పైసీ కొరియన్ క్యాబేజీ

కరోనా కాలంలో కొరియన్ వంటకాలకు బాగా క్రేజ్ పెరిగిందని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో తేలింది. కిమ్చీ కూడా ఓ కొరియన్ వంటకమే. ఇందులో క్యాబేజీ లేదా కూరగాయలను పులియబెడతారు.  ఆహారంలో దీనిని చేర్చుకోవడం వల్ల  జీర్ణ సంబంధ సమస్యలన్నీ తొలగిపోతాయి. జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది.

వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు, ఎక్సర్ సైజులు చేయడం వల్ల దీర్ఘకాలిక కొవిడ్  లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చని

Also Read: Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే! అంత ఈజీ కాదండోయ్.!

Harish Rao: కేంద్రంపై మరో లేఖాస్త్రం సంధించిన హరీశ్ రావు.. ఈసారి దేనికోసమంటే..

Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్.. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు..