AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: కేంద్రంపై మరో లేఖాస్త్రం సంధించిన హరీశ్ రావు.. ఈసారి దేనికోసమంటే..

రాబోయే బడ్జెట్‌లో  తెలంగాణ (Telangana) రాష్ట్రానికి నిధులు కేటాయించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ (KTR) కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.  తాజాగా  మరోమంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao)

Harish Rao: కేంద్రంపై మరో లేఖాస్త్రం సంధించిన హరీశ్ రావు.. ఈసారి దేనికోసమంటే..
Basha Shek
|

Updated on: Jan 24, 2022 | 6:25 PM

Share

రాబోయే బడ్జెట్‌లో  తెలంగాణ (Telangana) రాష్ట్రానికి నిధులు కేటాయించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ (KTR) కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.  తాజాగా  మరోమంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) కేంద్రంపై  మరో లేఖాస్త్రం సంధించారు.  కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల‌ను విడుద‌ల చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ఆయన లేఖ రాశారు. ఈ విషయంపై తాము  గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖ‌లో వివరంగా గుర్తు చేశారు మంత్రి.

*ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేళ్ల బ‌కాయి రూ.900 కోట్లను ఇంకా విడుదల చేయలేదని మంత్రి కేంద్రానికి గుర్తుచేశారు. వీటిని విడుదల చేయడంతో పాటు ఈ గ్రాంట్‌ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడిగించాలని మంత్రి కేంద్రాన్ని కోరారు.  నీతి ఆయోగ్ సూచించిన  మేరకు రూ.24,205 కోట్ల సాయాన్ని వెంటనే  విడుద‌ల చేయాలని లేఖలో విన్నవించారు.

*స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 502.29 కోట్లు) ఇవ్వాల‌న్న 14వ ఆర్థిక సంఘం సిఫార‌సుల‌ను కేంద్రం ఎందుకు తిర‌స్క‌రించిందో ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేదు. రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్ల‌ను తిర‌స్క‌రించారు. కాబట్టి వీటిని వీలైనంత త్వరగా విడుదలయ్యేలా చూడాలని హరీశ్ కేంద్రాన్ని అభ్యర్థించారు.

* 2019-20తో పోల్చితే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని ఈ మేర‌కు తెలంగాణ‌కు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుద‌ల చేయాల‌ని 15వ ఆర్థిక సంఘం సూచించింది. ఆర్థిక సంఘం సిఫార్సుల‌ను గతంలో ఎప్పుడూ తిర‌స్క‌రించిన సంద‌ర్భాలు లేవు. కాబ‌ట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ నిధుల‌ను మంజూరు చేయాలి.

*రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలలో… రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమైన 2014-15లో కేంద్రం వాటాను పొర‌బాటున తెలంగాణ‌కు కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారు. దీంతో తెలంగాణ‌కు రావాల్సిన రూ.495.20 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి. ఈ విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లాం.  అయినా ఈ గ్రాంటు ఇంకా తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదు. కాబట్టి ఈ మొత్తాన్ని వెంట‌నే తెలంగాణకు విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను.

* వీటితోపాటు పెండింగ్ లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ.210 కోట్ల‌ను కూడా స‌ర్దుబాటు చేయాల్సిందిగా మంత్రి లేఖలో కేంద్రాన్ని కోరారు.

Also Read: Ram Gopal Varma: ఎక్జార్సిస్ట్ తర్వాత మళ్లీ ఈ సినిమానే.. రేవతి మూవీపై ప్రశంసలు కురిపించిన రామ్‌ గోపాల్‌ వర్మ..

Coronavirus: కరోనా బారిన పడ్డ ఎన్సీపీ అధినేత.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని మోదీ..

Sonakshi Sinha: పెళ్లెప్పుడు చేసుకుంటావ్? అని అడిగిన నెటిజన్.. సోనాక్షి ఏం సమాధానం చెప్పిందో తెలుసా?

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!