Coronavirus: కరోనా బారిన పడ్డ ఎన్సీపీ అధినేత.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని మోదీ..

దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ (Covid 19)  మరోసారి బుసలు కొడుతోంది.  ఎంత అప్రమత్తంగా ఉంటున్నా, వైరస్ (Corona Virus) కు సంబంధించి అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నా

Coronavirus: కరోనా బారిన పడ్డ ఎన్సీపీ అధినేత..  ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని మోదీ..
Sharad Pawar
Follow us
Basha Shek

|

Updated on: Jan 24, 2022 | 4:56 PM

దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ (Covid 19)  మరోసారి బుసలు కొడుతోంది.  ఎంత అప్రమత్తంగా ఉంటున్నా, వైరస్ (Corona Virus) కు సంబంధించి అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ మాత్రం ఏదో రూపంలో వెంటాడుతూనే ఉంది.  మూడో దశలో సామాన్యులతో పాటు  సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు వరుసగా కరోనాకు గురవుతున్నారు.  తాజాగా సీనియర్ రాజకీయ నాయకులు,  నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ పవార్‌ (Sharad Pawar) ఈ మహమ్మారి బాధితుల జాబితాలో చేరిపోయారు. కరోనా సోకినట్లు ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

గతేడాది కూడా…

‘నాకు ఈరోజు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  వైద్యుడు సూచించిన విధంగా చికిత్సను తీసుకుంటున్నా. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారందరూ  కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి.  తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అని శ‌ర‌ద్ పవార్‌ ట్వీట్ చేశారు. కాగా  గతేడాది ఆగస్టులో శ‌ర‌ద్ పవార్‌ ఇంట్లో కరోనా క‌ల‌క‌లం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయ‌న నివాసంలోని న‌లుగురు మహమ్మారి బారిన పడ్డారు.  ఇంట్లో ప‌ని చేసే వంట మ‌నిషి, ఇద్ద‌రు సెక్యూరిటీ సిబ్బందితో పాటు మ‌రొక‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. అయితే శ‌ర‌ద్ ప‌వార్‌కు మాత్రం కొవిడ్-19 నెగిటివ్ వ‌చ్చింది. కానీ మూడో వేవ్ లో మాత్రం  కరోనా నుంచి తప్పించుకోలేకపోయారు. కాగా శరద్ పవార్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారు. దీనిపై స్పందించి ఎన్సీపీ అధినేత తన ఆరోగ్యం పట్ల స్పందించిన మోదీకి శరద్ పవార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Sonakshi Sinha: పెళ్లెప్పుడు చేసుకుంటావ్? అని అడిగిన నెటిజన్.. సోనాక్షి ఏం సమాధానం చెప్పిందో తెలుసా?

Coronavirus: కోలీవుడ్‌ ను వదలని కరోనా.. స్టార్‌ డైరెక్టర్‌ దంపతులకు పాజిటివ్‌..

Srikanth: శ్రీశైలం మల్లన్న సేవలో శ్రీకాంత్.. స్వామి వారిని ఏం కోరుకున్నారంటే..