Srikanth: శ్రీశైలం మల్లన్న సేవలో శ్రీకాంత్.. స్వామి వారిని ఏం కోరుకున్నారంటే..

ప్రముఖ నటుడు శ్రీకాంత్ (Srikanth)  కర్నూల్ (Kurnool) జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం(Srisailam) లో సందడి చేశారు. అక్కడి  భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామి స్వామిని దర్శించుకున్నారు

Srikanth: శ్రీశైలం మల్లన్న సేవలో శ్రీకాంత్.. స్వామి వారిని ఏం కోరుకున్నారంటే..
Srikanth
Follow us
Basha Shek

|

Updated on: Jan 24, 2022 | 2:34 PM

ప్రముఖ నటుడు శ్రీకాంత్ (Srikanth)  కర్నూల్ (Kurnool) జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం(Srisailam) లో సందడి చేశారు. అక్కడి  భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా దర్శనానంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు శ్రీకాంత్.  కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ త్వరగా బయట పడాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. ‘అఖండ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదేవిధంగా మాబాబు (రోషన్) నటించిన ‘పెళ్లిసందడి’ కూడా మంచి విజయం సాధించింది.  అందుకే శ్రీశైలం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నాను.

కరోనా అంతమైపోవాలని ..

‘ఎప్పటి నుంచో శ్రీశైలం రావాలని, మల్లికార్జునస్వామిని దర్శించుకోవాలనుకుంటున్నాను. కానీ కుదరలేదు. ఇప్పటికీ కుదిరింది.  ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా పీడ త్వరగా అంతమైపోవాలని స్వామివారిని కోరుకున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు శ్రీకాంత్. బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమాలో శ్రీకాంత్ తనదైన విలనిజంతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్-శంకర్ కాంబినేషనలో తెరకెక్కుతోన్న RC 15(వర్కింగ్ టైటిల్) చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఇక ఆయన తనయుడు రోషన్ హీరోగా నటించిన ‘పెళ్లిసందడి’ చిత్రం కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇటీవల తన తదుపరి సినిమాను కూడా పట్టాలెక్కించాడు రోషన్.

Also Read: DRDO Apprentice Recruitment 2022: DRDOలో 150 అప్రెంటీస్ ఖాళీలు.. చివరి తేదీ ఇదే.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా..

Ranga Ranga Vaibhavanga: రంగ రంగ వైభవంగా అంటూ వచ్చేస్తున్న మెగా హీరో.. టైటిల్ టీజర్ విడుదల చేసిన వైష్ణవ్ తేజ్.. 

IND vs SA: వన్డేల్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసింది వీరే..