Ranga Ranga Vaibhavanga: రంగ రంగ వైభవంగా అంటూ వచ్చేస్తున్న మెగా హీరో.. టైటిల్ టీజర్ విడుదల చేసిన వైష్ణవ్ తేజ్.. 

Ranga Ranga Vaibhavanga: రంగ రంగ వైభవంగా అంటూ వచ్చేస్తున్న మెగా హీరో.. టైటిల్ టీజర్ విడుదల చేసిన వైష్ణవ్ తేజ్.. 
Vaishnav Tej

మెగా హీరో వైష్ణవ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

Rajitha Chanti

|

Jan 24, 2022 | 2:10 PM

మెగా హీరో వైష్ణవ తేజ్ (Vaishnav Tej) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్‏ను హీరోగా పరిచయం చేస్తూ డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన (Uppena) మూవీ థియేటర్ల వద్ద సెన్సెషనల్ హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత.. క్రిష్ దర్శకత్వంలో కొండపొలం (Kondapolam) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా తన మూడవ చిత్రాన్ని అనౌన్స్ చేశారు మేకర్స్.

డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో రొమాంటిక్ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ మూవీకి రంగ రంగ వైభవంగా అనే టిైటిల్ ఫిక్స్ చేశారు.. ఈమేరకు సోమవారం (జనవరి 24) టైటిల్ టీజర్ విడుదల చేశారు. అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు అంటూ హీరోకు బటర్ ఫ్లై కిస్‏ను బహుమతిగా ఇచ్చింది. ఇది నెక్స్ లెవల్లో ఉందన్న హీరో డైలాగ్‏తో టీజర్ పూర్తైంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆస‌క్తిక‌రంగా భామా క‌లాపం టీజర్‌..

Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..

Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..

Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu