BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆస‌క్తిక‌రంగా భామా క‌లాపం టీజర్‌..

BhamaKalapam Teaser: ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త కంటెంట్‌ను అందిస్తూ వ‌స్తోన్న ఆహా తాజాగా భామా క‌లాపం పేరుతో మ‌రో కొత్త సినిమాను తీసుకొస్తోంది. చాలా రోజుల త‌ర్వాత ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచ‌నాలున్నాయి...

BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆస‌క్తిక‌రంగా భామా క‌లాపం టీజర్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 23, 2022 | 6:52 PM

BhamaKalapam Teaser: ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త కంటెంట్‌ను అందిస్తూ వ‌స్తోన్న ఆహా తాజాగా భామా క‌లాపం పేరుతో మ‌రో కొత్త సినిమాను తీసుకొస్తోంది. చాలా రోజుల త‌ర్వాత ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచ‌నాలున్నాయి. ఈ సినిమా త్వ‌ర‌లోనే ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ కానుంది. అభిమాన్యు తాడిమేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11 నుంచి సంద‌డి చేయ‌నుంది.

విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతోన్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. 1.29 నిమిషం నిడివితో ఉన్న ఈ టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది. ఈ సినిమాలో ప్రియ‌మ‌ణి అనుప‌మ అనే హౌజ్ వైఫ్ పాత్ర‌లో క‌నిపిస్తోంది. పొరిగిళ్లలో ఏం జ‌రుగుతుందో తెలుసుకోవ‌డానికి ఆతృత చూపించే మ‌హిళ పాత్రలో ప్రియ‌మ‌ణి ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే అర్థ‌రాత్రి ఓ అపార్ట్‌మెంట్‌లో హ‌త్య జ‌రుగుతుంది.

ఇంత‌కీ ఆ మ‌ర్డ‌ర్‌కి, అనుప‌మ‌కు సంబంధం ఏంటి.? దీని వ‌ల్ల అనుప‌మ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న క‌థాంశాన్ని ఇతివృత్తంగా తెర‌కెక్కించారు. ఇక టీజ‌ర్‌లో వ‌చ్చే చాలా డేంజ‌ర‌స్ హౌజ్ వైఫ్ రా అనే డైలాగ్ ప్రియ‌మ‌ణి పాత్రపై మ‌రింత ఆసక్తిని పెంచేసింది. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగ సాగిన ఈ థ్రిల్ల‌ర్ టీజ‌ర్‌ను మీరూ చూసేయండి..

Also Read: Vastu Tips: ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. వెంటనే వాస్తు నియమాలలో మార్పులు చేయండి..

Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..

Ganguly vs Kohli: భారత క్రికెట్​లో ఏం జరుగుతుంది.. ఆ వివాదానికి ముగింపు పలకాల్సిందేనా..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?