AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: కోలీవుడ్‌ ను వదలని కరోనా.. స్టార్‌ డైరెక్టర్‌ దంపతులకు పాజిటివ్‌..

కోలీవుడ్  స్టార్ హీరో ధనుష్ (Dhanush) సోదరుడు, ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ (Selvaraghavan) కరోనా (corona virus) బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు

Coronavirus: కోలీవుడ్‌ ను వదలని కరోనా.. స్టార్‌ డైరెక్టర్‌ దంపతులకు పాజిటివ్‌..
Selvaraghavan
Basha Shek
|

Updated on: Jan 24, 2022 | 3:01 PM

Share

కోలీవుడ్  స్టార్ హీరో ధనుష్ (Dhanush) సోదరుడు, ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ (Selvaraghavan) కరోనా (corona virus) బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ 2-3 రోజుల్లో తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.   ‘గుడ్ మార్నింగ్. నాకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. గత రెండు, మూడు రోజులుగా నన్ను కలిసిన వారందరు తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోండి. దయచేసి అందరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి సురక్షితంగా ఉండాలని కోరుతున్నాను’’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు సెల్వ రాఘవన్.

సెల్వ రాఘవన్ సతీమణి గీతాంజలి కూడా కరోనాకు గురయ్యారు. కాగా ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’, ‘యుగానికి ఒక్కడు’, ‘వర్ణ’, ‘ఎన్జీకే వంటి సినిమాలతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన తమిళంలో ‘నన్నే వరువిన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా  ఇటీవల నటుడు జయరామ్ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.

Also Read: Srikanth: శ్రీశైలం మల్లన్న సేవలో శ్రీకాంత్.. స్వామి వారిని ఏం కోరుకున్నారంటే..

Telangana: క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. ఆదివారం వ‌చ్చిందంటే అక్క‌డ వ‌ణుకు

Liger Movie: విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు మరో అరుదైన గౌరవం.. అదేంటంటే..