AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger Movie: విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు మరో అరుదైన గౌరవం.. అదేంటంటే..

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Liger Movie: విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు మరో అరుదైన గౌరవం.. అదేంటంటే..
Liger
Rajeev Rayala
|

Updated on: Jan 24, 2022 | 2:41 PM

Share

Liger Movie:క్రేజీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda )నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్(Liger). డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్( ‎Puri Jagannadh ) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరల్డ్ మోస్ట్ లవర్ సినిమా తర్వాత విజయ్ చేస్తున్న సినిమా ఇది. అలాగే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన పూరి .ఇప్పడు లైగర్ సినిమాతో మరో హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లు, గ్లిమ్ప్స్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఛార్మి, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరీజగన్నాథ్ తనదైన మార్క్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజ్ లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. ఇదిలా ఉంటే వరుస అప్డేట్స్ తో లైగర్ టీమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఇక గ్లిమ్ప్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక చేసింది తక్కువ సినిమాలే అయినా విజయ్ దేవరకొండకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే విజయ్ కు బాలీవుడ్ లోనూ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా లైగర్ తో అక్కడ కూడా ఫాలోయింగ్ పెంచుకోనున్నాడు విజయ్. ఇదిలా ఉంటే లైగర్ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. సాండ్ ఆర్టిస్టు దశరత్ మోహంట అద్బుతమైన లైగర్ ఆర్ట్ ను వేశాడు. విజయ్ దేవరకొండ మరియు మైక్ టైసన్ ల ఫేస్ లతో ఈ ఆర్ట్ వేశారు. అత్యంత ప్రముఖులకు మాత్రమే ఇలా ఆర్ట్స్ వేస్తారు. ఇప్పుడు లైగర్ సినిమాకు ఈ ఆర్ట్ వేయడం అభిమానులను ఆకట్టుకుంటుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ranga Ranga Vaibhavanga: రంగ రంగ వైభవంగా అంటూ వచ్చేస్తున్న మెగా హీరో.. టైటిల్ టీజర్ విడుదల చేసిన వైష్ణవ్ తేజ్.. 

Viral Video : హాలీవుడ్‌ పాటకు భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టిన పెళ్లి కూతురు..!

Vishnu Priya: సమంత పాటకు విష్ణుప్రియ రిహర్సల్ అదుర్స్.. ఊ అంటావ మావ అంటూ రచ్చ..