AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: ఎక్జార్సిస్ట్ తర్వాత మళ్లీ ఈ సినిమానే.. రేవతి మూవీపై ప్రశంసలు కురిపించిన రామ్‌ గోపాల్‌ వర్మ..

ప్రముఖ సీనియర్ నటి రేవతి (Revathi) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భూతకాలం’ (Bhoothakalam).మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో విడుదలైంది

Ram Gopal Varma: ఎక్జార్సిస్ట్ తర్వాత మళ్లీ ఈ సినిమానే.. రేవతి మూవీపై  ప్రశంసలు కురిపించిన రామ్‌ గోపాల్‌ వర్మ..
Basha Shek
|

Updated on: Jan 24, 2022 | 5:42 PM

Share

ప్రముఖ సీనియర్ నటి రేవతి (Revathi) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భూతకాలం’ (Bhoothakalam).మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీలివ్ లో విడుదలైంది. రేవతితో పాటుషేన్ నిగమ్, సైజూ కురూప్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా హారర్ కథాంశంతో రాహుల్ సదాశివన్ ఎంతో సహజంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. అన్వర్ రషీద్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత తెరపై కనిపించిన రేవతి నటన అద్భుతంగా ఉందంటున్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు హారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరొందిన ప్రముఖ దర్శకుడు  రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఈ సినిమాను వీక్షించారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

‘ఎక్జార్సిస్ట్’ తర్వాత ‘భూతకాలం’ అనే  చిత్రం కన్నా మరో హారర్ మూవీని ఇప్పటిదాకా నేను  మళ్లీ చూడలేదు. షేన్ నిగమ్, రేవతి  అద్భుతంగా నటించారు.  ఇలాంటి సినిమాతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన దర్శకుడు రాహుల్ సదాశివన్ కు, నిర్మాత అన్వర్ రషీద్ కు అభినందనలు’  అని తెలిపారు వర్మ. కాగా గతంలో రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma) తెరకెక్కించిన ‘రాత్రి’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది రేవతి. ఇప్పుడు ఆమె నటించిన హారర్ చిత్రాన్ని వర్మ ప్రశంసించడం ఆసక్తిని రేపుతోంది.

Also Read: Coronavirus: కరోనా బారిన పడ్డ ఎన్సీపీ అధినేత.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని మోదీ..

Stock Markets: కుప్పకూలిన మండే మార్కెట్లు.. రూ. 20 లక్షల కోట్లు ఆవిరి.. కోలకునేది ఎప్పుడంటే..

Sonakshi Sinha: పెళ్లెప్పుడు చేసుకుంటావ్? అని అడిగిన నెటిజన్.. సోనాక్షి ఏం సమాధానం చెప్పిందో తెలుసా?