Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్.. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు..

టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలినాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ లపై  చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్.. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు..
Buddha Venkanna
Follow us
Basha Shek

|

Updated on: Jan 24, 2022 | 7:40 PM

టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న(Budda Venkanna)ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలినాని (K0dali Nani), డీజీపీ గౌతమ్ సవాంగ్ (Goutam Sawang) లపై  చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  కాగా ఈ రోజు ఉదయం మీడియా సమావేశం ఏర్పాటుచేసిన బుద్ధా వెంకన్న గుడివాడ క్యాసినో వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కొడాలి నాని ఆధ్వర్యలో క్యాసినో నిర్వహించారని,  అందులో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు వాటా ఉందని ,  అందుకే కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

అదేవిధంగా చంద్రబాబు ఇంటిగేటు తాకితే కొడాలి నాని శవాన్ని ఇంటికి పంపిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై వివరణ కోరేందుకు ఉదయమే బుద్ధా ఇంటికి వెళ్లారు పోలీసులు.  కాగా అరెస్ట్ సమయంలోనూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు బుద్ధా వెంకన్న. తాను మాట్లాడిన మాటలు పచ్చి నిజాలంటూ.. డీజీపీ జగన్ కు తొత్తుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.  కాగా ఆయనను  అరెస్ట్ చేస్తున్నారన్న విషయం తెలియగానే  పార్టీ కార్యకర్తలు, నేతలు భారీగా  ఇంటికి  చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు..

Akshay Kumar: కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన అక్షయ్‌ కుమార్‌!.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Harish Rao: కేంద్రంపై మరో లేఖాస్త్రం సంధించిన హరీశ్ రావు.. ఈసారి దేనికోసమంటే..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?