Covid-19: వంటగదిలో ఇవి ఉంటే రోగనిరోధక శక్తికి ఢోకా ఉండదు.. వైరస్‌ల బారి నుంచి కూడా పూర్తి రక్షణ..!

Health Tips: ఇమ్యూనిటీ బూస్టర్ పేరుతో మార్కెట్‌లో అనేక వస్తువులు విక్రయిస్తున్నారు. కానీ, మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచే వాటిని తీసుకోవాలి. ఇవి వ్యాధి బారిన పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం మీరు..

Covid-19: వంటగదిలో ఇవి ఉంటే రోగనిరోధక శక్తికి ఢోకా ఉండదు.. వైరస్‌ల బారి నుంచి కూడా పూర్తి రక్షణ..!
Kitchen Medicines
Follow us
Venkata Chari

|

Updated on: Jan 24, 2022 | 12:27 PM

Health Tips: దేశంలో కోవిడ్-19 కేసులు మరోసారి పెరగడం ప్రారంభించాయి. ఇలాంటి పరిస్థితిలో, రోగనిరోధక శక్తిని పెంచే విషయాలపై భారతీయులంతా దృష్టి పెడుతున్నారు. ఇమ్యూనిటీ బూస్టర్ పేరుతో మార్కెట్‌లో అనేక వస్తువులు విక్రయిస్తున్నారు. కానీ, మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచే వాటిని తీసుకోవాలి. ఇవి వ్యాధి బారిన పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే వస్తువులు మీ వంటగదిలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దాల్చిన చెక్క – దాల్చిన చెక్క ఔషధ గుణాలను కలిగి ఉంది. తరచుగా ప్రజలు దీనిని ఆహారంలో, టీలో లేదా స్వీట్లలో కలపడం ద్వారా ఉపయోగిస్తుంటారు. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దాల్చినచెక్కను మీరు ప్రతిరోజూ తీసుకుంటే, కరోనా వంటి అంటు వ్యాధులను నివారించేందుకు ప్రభావంతంగా పనిచేస్తుంది.

ఉసిరికాయ- ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. ఇందులో విటమిన్ సితో పాటు ట్రెటినోయిన్ కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అదే సమయంలో, ఏదైనా కారణం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌తో పోరాడడంలో ఇది సహాయపడుతుంది. దీని కోసం మీరు ప్రతిరోజూ 3 ఉసిరికాయలను తిసుకోవచ్చు.

పసుపు – పసుపు యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. మీరు దీన్ని ప్రతిరోజూ ఉపయోగిస్తే, ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ప్రమాదకరమైన వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. పసుపు మన శరీరానికి అంటు వ్యాధులను నివారించే శక్తిని ఇస్తుంది.

అల్లం – దగ్గు వచ్చినప్పుడు అల్లం, బెల్లం, కారం, నెయ్యి వంటివి తినడం మంచిది. అల్లంలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి చలికాలంలో అల్లం తప్పనిసరిగా తీసుకోవాలి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Also Read: Student Selfies: ఓ యువకుడిని కోటిశ్వరుడిని చేసిన సెల్ఫీ సరదా.. ఐదేళ్లుగా రోజుకొక సెల్ఫీ.. ఆన్ లైన్ లో అమ్మకం..

Corn Bread or Makka Roti Benefits: మొక్కజొన్న రొట్టెతో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు..