AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corn Bread or Makka Roti Benefits: మొక్కజొన్న రొట్టెతో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు..

మొక్కజొన్న రొట్టె.. దీనినే మక్క రొట్టే అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో ఈ మక్కరొట్టెను

Corn Bread or Makka Roti Benefits: మొక్కజొన్న రొట్టెతో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు..
Makka Roti
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2022 | 9:59 AM

Share

మొక్కజొన్న రొట్టె.. దీనినే మక్క రొట్టే అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో ఈ మక్కరొట్టెను తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇందులో మాంగనీస్, పొటాషియం, జింక్, ఐరన్, పాస్పరస్, కాపర్, సెలీనియం, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. కళ్లకు మేలు చేస్తుంది. మొక్కజొన్నలో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెలో అధిక మొత్తంలో కెరోటినాయిడ్లు, విటమిన్ ఎ లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. కళ్లకు మేలు చేస్తుంది. మన శరీరంలో ఎర్ర రక్తకణాలు లేకపోవడం వలన రక్తహీనత ఏర్పడుతుంది. ఇందుకో ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండేవి తినాలి. మొక్కజొన్నలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది.

మొక్కజొన్నలో పీచు ఎక్కువగా లభిస్తుంది. మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి అనుమతించదు. మొక్కజొన్న రొట్టె గుండెజబ్బులను తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువ శాతంలో పీచు పదార్థం ఉండడం వలన మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిని తీసుకోవడం వలన త్వరగా ఆకలి వేయదు. దీంతో తరచు తినే అలవాటు తగ్గుతుంది. అందువలన బరువు తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి, రక్తపోటు వంటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తపోటు సమస్య ఉన్నవారికి మొక్కజొన్న మంచిది.

Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆస‌క్తిక‌రంగా భామా క‌లాపం టీజర్‌..

Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..

Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..

Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..