Indian Army 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగావకాశాలు.. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే.!

Indian Army 10+2 Technical Entry Scheme 2022: ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద 2022 సంవత్సరానికి గానూ 47వ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారికి ఐదేళ్ల శిక్షణ అనంతరం ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు ఆఫీసర్లుగా నియామకాలు జరుగుతాయి. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

Indian Army 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగావకాశాలు.. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే.!
Indian Army 10+2 Technical
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 24, 2022 | 6:18 PM

Indian Army 10+2 Technical Entry Scheme 2022: ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద 2022 సంవత్సరానికి గానూ 47వ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారికి ఐదేళ్ల శిక్షణ అనంతరం ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు ఆఫీసర్లుగా నియామకాలు జరుగుతాయి. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు పోస్టు: ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు

మొత్తం ఖాళీల సంఖ్య: 90

పే స్కేల్: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు.

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం సబ్జెక్టులుగా ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. JEE Main 2021 పరీక్షకు హాజరైయుండాలి. నోటిఫికేషన్లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధులు జనవరి 2, 2003 నుంచి జనవరి 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూ మొత్తం 5 రోజులు నిర్వహిస్తారు. ఈ సమయంలో వివిధ స్టేజుల్లో అభ్యర్ధులను పరీక్షించడం జరుగుతుంది.

ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూలు ప్రారంభం: ఏప్రిల్ 2022

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Delhi Postal Circle Recruitment 2022: పదో తరగతి అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!