President Election: సోనియా, మమత, శరద్ పవార్‌లకు ఫోన్ చేసిన NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము..

Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫు అభ్యర్థి ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె స్వయంగా సోనియాగాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీలకు ఫోన్ చేశారు.

President Election: సోనియా, మమత, శరద్ పవార్‌లకు ఫోన్ చేసిన NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము..
Draupadi Murmu
Follow us

|

Updated on: Jun 24, 2022 | 3:01 PM

Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫు అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వయంగా సోనియాగాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీలకు ఫోన్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా వారి మద్ధతు కోరారు. శుక్రవారంనాడు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆమె వ్యక్తిగతంగా వారికి ఫోన్ చేసినట్లు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆమెకు వారు ముగ్గురూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పినట్లు తెలిసింది.

ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శుక్రవారం ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, జైరాం ఠాగూర్, ఫుస్కర్ సింగ్ ధమి, ఎన్డీయే కూటమికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్ధతు ప్రకటించిన వైసీపీ, బీజూ జనతా దళ్(BJD), అన్నా డీఎంకే తరఫు ప్రతినిధులు పాల్గొన్నారు. వైసీపీ తరఫున ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయి రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు.

విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యస్వంత్ సిన్హా పేరును ఇప్పటికే ఖరారు చేశారు. యస్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విపక్ష నేతలకు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో యస్వంత్ సిన్హాకు మద్ధతు ఇస్తున్న మరికొందరు విపక్ష నేతలకు కూడా ద్రౌపది ముర్ము ఫోన్‌ చేసి తన అభ్యర్థిత్వానికి మద్ధతు కోరినట్లు తెలిసింది. ద్రౌపది ముర్ము విపక్ష నేతలకు ఫోన్ చేసి మద్ధతు కోరడం ద్వారా.. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఆమె చివరి ప్రయత్నం చేసినట్లయ్యింది. అయితే దీనిపై విపక్షాలు సానుకూలంగా స్పందించి రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేస్తాయా? లేక ఇది వరకే నిర్ణయించిన మేరకు యస్వంత్ సిన్హాను బరిలో నిలుపుతాయా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైతే జులై 18న ఓటింగ్ జరగనుంది. జులై 21న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు